- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఖరీదైనవే కాదు.. చవకైన ఆహారాలతోనూ ఆరోగ్యం.. వాటికి బదులుగా వీటితింటే చాలు!
ఓట్స్‌కి బదులుగా దలియా, బాదంకి బదులుగా వేరుశనగ తీసుకున్నా అవే పోషకాలు లభిస్తాయి. పైగా ఖర్చు తక్కువ!

దిశ, ఫీచర్స్ : మార్కెట్‌లో, అందమైన కవర్లలో ప్యాక్ చేసిన, ఖరీదైన లేదా బ్రాండెడ్ పోషకాహారాలే మనకు మేలు చేస్తాయా? దిగమతి చేసుకున్న ఓట్స్, ప్యాకెట్ బాదం, వాల్‌నట్స్, టోఫు వంటివి మాత్రమే ఆరోగ్యానికి మంచిదా? కానే కాదు. అంతకంటే తక్కువ ఖర్చుతో కూడా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అచ్చం అలాంటి పోషకాలనే పొందవచ్చు అంటుంటారు నిపుణులు. పైగా ఇటువంటి సహజమైన ఆహారాలు తినే తాము ఎక్కువ రోజులు బతికామని కూడా అమ్మమ్మలు, తాతయ్యలు చెబుతుంటారు. ముఖ్యంగా అలాంటి వాటిలో ఓట్స్‌కి బదులుగా దలియా, బాదంకి బదులుగా వేరుశనగ, ప్యాకెట్ జ్యూస్‌లకు బదులుగా మజ్జిగా, వాల్‌నట్స్‌కి బదులుగా వేరు శనగలు ఎంతో మేలు చేస్తాయని చెబుతున్నారు. పోషకాహార నిపుణులు కూడా ఇవి తక్కువ ఖర్చులో మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే ప్రత్యామ్నాయ ఆహారాలుగాగా పేర్కొంటారు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
1. ఓట్స్‌కి బదులు దలియా
ఓట్స్‌లో ఏవైతే పోషకాలు లభిస్తాయో అవే పోషకాలు దలియా (విరిగిన గోధుమలు)లో కూడా లభిస్తాయి. పైగా స్థానికంగా లభించే మంచి ప్రత్యామ్నాయం కూడాను. ఇందులో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, డైటరీ ఫైబర్, ప్రోటీన్, ఐరన్, మెగ్నీషియం, జింక్, బి- విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి.ఇది జీర్ణక్రియను, గట్ హెల్త్‌ను మెరుగు పరుస్తుంది. ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉండేలా చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఓట్స్ కంటే తక్కువ ఖర్చుతో సులభంగా దొరుకుతాయి. ఓట్స్ కంటే తక్కువ ఖర్చుతో సులభంగా దొరుకుతాయి. పైగా పైగా రోజువారీ ఎనర్జీని ఇవ్వడంలో దలియా చాలా ప్రభావవంతంగా ఉంటుంది.
2. బాదంకి బదులు వేరుశనగ
వేరుశనగలో ప్రోటీన్, హెల్తీ ఫ్యాట్స్, ఫైబర్, విటమిన్ ఇ, బి- విటమిన్లు, ముఖ్యంగా నియాసిన్, ఐరన్, మెగ్నీషియం, యాటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలో గుడ్ కొలెస్ట్రాల్‌ను పెంచి, గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. ఎముకల బలానికి, దీర్ఘకాలిక శక్తిని అందించడానికి సహాయపడతాయి. బాదం కంటే తక్కువ ధరలో లభించే వేరుశనగ, ప్రోటీన్ అవసరం ఎక్కువగా ఉన్నవారికి మంచి ఎంపిక. ఇవి ఆకలిని అదుపులో ఉంచి బరువు నియంత్రణలో సహాయపడతాయి.
3. ప్యాకెట్ జ్యూస్‌లకు బదులుగా మజ్జిగ
మజ్జిగలో ప్రోబయోటిక్స్, కాల్షియం, ప్రోటీన్, విటమిన్ బి-12, పొటాషియం & జింక్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఎసిడిటీని తగ్గిస్తుంది. ప్యాకెట్ జ్యూస్‌లలో ఉండే అధిక చక్కెర, ఫ్రక్టోజ్‌కి బదులు, మజ్జిగ తక్కువ కేలరీలతో ఆరోగ్యకరమైన ఎంపిక. వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచి, ఎనర్జీ ఇవ్వడంలో చాలా ఉపయోగం.
4. వాల్‌నట్స్‌కి బదులుగా వేరుశనగలు
వేరు శనగలో ఎక్కువ ప్రోటీన్, ఫైబర్, హెల్తీ ఫ్యాట్స్, విటమిన్ ఇ, బి-విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు వంటివి సమృద్ధిగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. రక్తపోటును అదుపులో, శరీరానికి శక్తిని అందించడంలో సహాయపడతాయి. ఎముకలు, కండరాల అభివృద్ధికి మేలు చేస్తాయి. వాల్‌నట్స్‌లో ఒమేగా-3 కాస్త ఎక్కువగా ఉన్నప్పటికీ, వేరుశనగలు చాలా తక్కువ ధరలో ఎక్కువ ప్రోటీన్, ఫైబర్ అందిస్తాయి. ఈ నాలుగూ ఈజీగా దొరికే, చవకైన, అంతే ఆరోగ్యకరమైన ఎంపికలని నిపుణులు చెబుతున్నారు. వీటిని రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం మంచిదని చెబుతున్నారు.
*గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.






