Health Tips : పాత ఇన్నర్‌వేర్ పడేస్తున్నారా? లేదంటే ఇన్ఫెక్షన్ గ్యారంటీ!

by Javid Pasha |

Health Tips : పాత ఇన్నర్‌వేర్ పడేస్తున్నారా? లేదంటే ఇన్ఫెక్షన్ గ్యారంటీ!
X

దిశ, ఫీచర్స్ : యూరినల్ ఇన్‌ఫెక్షన్‌ సమస్య తరచుగా వేధిస్తోందా? స్కిన్‌పై దురద, ర్యాషెస్ వంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారా? అయితే మీరు రోజూ ధరించే లో దుస్తులు కూడా అందుకు కారణం కావచ్చు అంటున్నారు నిపుణులు. ఎందుకంటే ప్రతిరోజూ ధరించే ఇన్నర్‌వేర్(underwear) మీద మన కంటికి కనిపించని రిస్క్ దాగి ఉందని చెబుతున్నారు. కాలక్రమంలో వీటిపై బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్ పేరుకుపోతాయి. ఇవి చర్మంపై దురద, ర్యాషెస్, ఇన్ఫెక్షన్స్, యీస్ట్ ఇన్ఫెక్షన్ (Candida), సిస్టైటిస్ (bladder infection) కలిగిస్తాయి. మొదట్లో వాషింగ్‌తో పోతాయి కానీ.. కొంత కాలం తర్వాత ఎంత హై-టెంపరేచర్‌లో అంటే వేడినీటితో ఉతికినా పూర్తిగా పోవు. అందుకే డాక్టర్లు, హైజీన్ నిపుణులు ఇస్తున్న సలహా ఏంటంటే.. మీ ఇన్నర్‌వేర్‌ని సంవత్సరానికి రెండు సార్లు (Every 6 months) మార్చండి. అంటే పాతవి పడేసి కొత్తవి కొనండి. ఇది స్త్రీ, పురుషులందరికీ వర్తిస్తుంది.

లో దుస్తుల్లోనే లేస్ కలిగినవి(like a net) కూడా కొంతకాలం తర్వాత బ్యాక్టీరియా, ఫంగస్‌లకు నిలయం కావచ్చు. వాటిని కూడా మార్చాలి. అయితే ఇన్నర్‌వేర్ విషయం మరీ భయంకరం! ఎందుకంటే ఈ గుడ్డలో గాలి ఎక్కువగా పాసవుతుంది. అలాగే బ్యాక్టీరియా, ఫంగస్ కూడా ఎక్కువగా చిక్కుకుపోతాయి. ఒక్కసారి ఈ క్లాత్‌పైకి చేరిన కొన్ని ప్యాథజన్స్(Pathogens) 45 రోజుల వరకు దానిమీద మీద సజీవంగా ఉంటాయి. అందుకే గైనకాలజిస్టులు, యూరాలజిస్టులు స్పష్టంగా చెబుతున్నది ఏమిటంటే.. లేస్ ఇన్నర్‌వేర్‌ని 3 నెలలకు మించి వాడకూడదు. అంతకంటే ఎక్కువ కాలం వాడితే ఇన్ఫెక్షన్ రిస్క్ బాగా పెరుగుతుంది. కాబట్టి సొల్యూషన్ చాలా సింపుల్ – కాటన్ ఇన్నర్‌వేర్ అయితే 6 నెలలకోసారి, లేస్/సింథటిక్ అయితే 3 నెలలకోసారి కొత్తవి కొనేయండి. రోజూ వాష్ చేయడం మాత్రమే కాదు, కొత్తవి మార్చడం కూడా ఆరోగ్యానికి చాలా ముఖ్యం. మీ ప్రైవేట్ హైజీన్‌కి ఈ చిన్నపాటి అలవాటు.. పెద్ద ఇబ్బందుల నుంచి కాపాడుతుందని నిపుణులు చెబుతున్నారు.

Next Story