మెరిసే చర్మం కోసం ఏ పేస్ ప్యాక్ లు అవసరం లేదు.. వీటిని తీసుకుంటే చాలు

by Disha Web Desk 10 |
మెరిసే చర్మం కోసం ఏ పేస్ ప్యాక్ లు అవసరం లేదు.. వీటిని తీసుకుంటే చాలు
X

దిశ,వెబ్ డెస్క్: ఈ రోజుల్లో ఎవరికి వారు అందంగా కనిపించాలని బ్యూటీ పార్లర్ కి వెళ్లి వేలకు వేలు పెడుతున్నారు. అయినా ప్రయోజనం మాత్రం ఉండటల్లేదు. అబ్బాయి అయినా.. అమ్మాయి అయినా వారి లుక్స్ పైన దృష్టి పెడుతున్నారు. మెరిసే చర్మం కోసం మీరు ఏ పేస్ ప్యాక్ లు వేసుకోవాల్సిన అవసరం లేదు.. వీటిని మీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా సహజంగా మెరిసే చర్మాన్ని పొందవచ్చు. అలాగే మీరు చర్మ సంబంధిత సమస్యల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు.

ఆకు కూరలు

ఆకు కూరలు మీరు తినే ఆహారంలో చేర్చుకుంటే సహజమైన కాంతిని పెంచుతుంది. వీటిలో యాంటీఆక్సిడెంట్లు, అవసరమైన విటమిన్లు, పోషకాలు, బచ్చలికూర, ముల్లంగి ఆకులు, ఆవాలు, కొత్తిమీర, బ్రోకలీ ఆకుపచ్చ ఆకు కూరలు మన చర్మం మెరుపును పెంచడంలో ఇవి సహాయపడతాయి.

పండ్లు

చర్మ సమస్యలు ఉన్న వారికి పండ్లు తినమని చెబుతుంటారు. వాటిలో మామిడి, బొప్పాయి, యాపిల్, అరటి, నారింజ, స్ట్రాబెర్రీ మొదలైన పండ్లలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. వాటిలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు A, B, C, E ఉంటాయి.

Read More: అలర్జీ ఉన్న వారు వీటి గురించి తప్పక తెలుసుకోవాలి!

Next Story

Most Viewed