Relationship: ఈ లక్షణాలు అబ్బాయిల్లో ఉంటే ఏ అమ్మాయి మిమ్మల్ని వదిలిపెట్టదు..!!

by Phanindra |

Relationship: ఈ లక్షణాలు అబ్బాయిల్లో ఉంటే ఏ అమ్మాయి మిమ్మల్ని వదిలిపెట్టదు..!!
X

దిశ, వెబ్ డెస్క్ : సమాజంలో కొందరు ఉన్నదానితో సరిపెట్టుకోకుండా.. అది లేదని, ఇది లేదని బాధపడుతూనే ఉంటారు. అమ్మాయిల్లో కొంతమంది అందంగా లేమని బ్యూటీ ఫార్లర్ చుట్టూ తిరుగుతుంటారు. ఇంకొందరు నేను అలా ఉంటే చాలా బాగుండేదాన్ని అని ఫీల్ అవుతుంటారు. ఇక అబ్బాయిలు నాలో అవి లేకపోవడం వలనే ఆ అమ్మాయి నన్ను ఇష్టపడేలేదని ఎవరికి వారే కుమిలి పోతుంటారు. అలాంటి వారు వీటి గురించి తెలుసుకోండి..

సాధారణంగా కొందరు అబ్బాయిలు ( boys ) నల్లగా ఉన్నానని, అందుకే అమ్మాయిలు ( girls ) ఎవరు ఇష్ట పడటం లేదని లోలోపల బాధ పడుతుంటారు. కానీ, నిజానికి అబ్బాయిల్లో అమ్మాయిలు చూసేది వ్యక్తిత్వం మాత్రమే అని ఓ సర్వేలో తేలింది. అయితే, ముఖ్యంగా అమ్మాయిలు అబ్బాయిల్లో చూసే లక్షణాలు ఏంటో ఇక్కడ చూద్దాం..

అమ్మాయిలు అబ్బాయిల్లో ప్రధానంగా చూసేది హైటు, హెయిర్. హైటు ఎక్కువగా ఉండి, హెయిర్ మంచిగా ఉండేవారిని ఎక్కువ ఇష్టపడతారట. ఇంకా మాట తీరు, ఎదుటి వాళ్ళకి ఇచ్చే గౌరవం ఇవన్నీ చూస్తారు. మోసం చేసే అబ్బాయిలను అమ్మాయిలు అస్సలు నమ్మరు. ఎప్పుడు నవ్విస్తూ ఉండేవారితో గర్ల్స్ స్నేహం చేయాలని అనుకుంటారట. ఇక, కొన్ని సార్లు మనం గమనిస్తే కొంతమంది అమ్మాయిలు, నల్లగా ఉండే అబ్బాయిలను లవ్ చేస్తుంటారు. ఇక్కడ వారి క్యారెక్టర్ ను చూసి ఇష్ట పడ్డారు. అలాగే, ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక అమ్మాయి ఎమోషన్స్ ని , అబ్బాయి ఎలా అర్ధం చేసుకుంటున్నాడనేది కూడా చూస్తారు. అలాగే, సమస్యలను సాల్వ్ చేసే అబ్బాయిలను చాలా ఇష్టపడతారట.. ఎలాంటి ఉద్యోగం చేస్తున్నాడు.. డబ్బును పొదుపు చేస్తున్నాడా లేక ఖర్చులు చేస్తున్నాడా అనే విషయాలను గమనిస్తూ ఉంటారట. ఇలాంటి విషయాల్లో అబ్బాయిలు ఫర్ఫెక్ట్ గా ఉంటే చాలు. ఏ అమ్మాయి మిమల్ని విడిచిపెట్టదు.

Next Story