క్రెడిట్ కార్డ్ 'సీవీసీ'లు హ్యాక్.. మోసానికి పాల్పడ్డ న్యూస్‌ పేపర్ సెల్లర్!

by Disha Web Desk 4 |
క్రెడిట్ కార్డ్ సీవీసీలు హ్యాక్.. మోసానికి పాల్పడ్డ న్యూస్‌ పేపర్ సెల్లర్!
X

దిశ, ఫీచర్స్ : అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్‌కు చెందిన ఓ వార్తాపత్రిక విక్రయదారుడు డజన్ల కొద్దీ క్రెడిట్ కార్డ్‌లను హ్యాక్ చేశాడు.వందలాది అనధికారిక కొనుగోళ్లతో పోలీసులకు చిక్కి జైలు పాలయ్యాడు. స్థానికంగా వార్తాపత్రికలు విక్రయించే 56 ఏళ్ల ఫెర్నాండో ఫాల్సెట్టీ క్రెడిట్ కార్డ్స్ సీవీసీ కోడ్‌ను క్రాక్ చేసేందుకు తనదైన టెక్నిక్ ఉపయోగించాడు. ఇందుకోసం కార్డ్ నంబర్, గడువు తేదీని విశ్లేషించడం ద్వారా నిర్దిష్ట అర్జెంటీనా బ్యాంక్ జారీ చేసిన కార్డ్‌ల CVCని క్రాక్ చేశాడని భద్రతా నిపుణులు గుర్తించారు. ఈ మేరకు ఫాల్సెట్టి తన పాత నోట్‌బుక్‌లో సీవీసీలకు సంబంధించిన 30-పేజీల అల్గారిథమ్‌ రాసుకున్నాడు. వార్తాపత్రికలు అమ్మే వ్యక్తికి అంతటి నాలెడ్జ్ ఉండటం అసాధ్యమనుకున్న అధికారులు అనుమానంతో ఎంక్వైరీ చేయగా, సదరు వ్యక్తి సిస్టమ్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్‌లో నైపుణ్యం కలిగిన కంప్యూటర్ ఇంజనీర్‌గా గుర్తించారు.

క్రెడిట్ కార్డ్‌లను ఎలా క్రాక్ చేయాలో ఫాల్సెట్టీ కనుగొన్న తర్వాత, అతను తన సొంత వార్తాపత్రిక స్టాండ్ నుంచి శాటిలైట్ టెలివిజన్ సబ్‌స్క్రిప్షన్ కొనుగోలు చేసేందుకు వాటిని ఉపయోగించాడు. తద్వారా అతను వాటి నుంచి కమీషన్ పొందగలిగాడు. ఇది చాలా తక్కువ మొత్తం కావడంతో ఆయా కార్డ్ ఓనర్స్ దీన్ని గమనించరని.. ఒకవేళ గుర్తించినా కేసు నమోదు చేయడని భావించాడు. అనుకున్నట్లుగానే సదరు వ్యక్తులు తమ క్రెడిట్ కార్డ్స్ నుంచి డెబిట్ అయిన మొత్తాలను గమనించినట్లు కనిపించనప్పటికీ.. వారిలో వందల మంది శాటిలైట్ టెలివిజన్ కంపెనీ సబ్‌స్క్రిప్షన్ తాము తీసుకోలేదని, వెంటనే తమ సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ ఫిర్యాదు చేశారు. దీంతో శాటిలైట్ టెలివిజన్ ఇందులో ఏదో మోసం జరిగిందనే అనుమానంతో దీనిపై ఫిర్యాదు చేయడంతో 'ఫాల్సెట్టీ' బాగోతం బయటపడింది.

ఫాల్సెట్టి తన స్టోర్ నుంచి కొనుగోళ్లు చేసేందుకు కార్డ్ డేటాను ఉపయోగించడం, అందుకు సంబంధించిన ఇన్‌వాయిస్‌లను తన ఇంట్లో ఉంచుకోవడం, కొనుగోళ్లు జరిగిన సిస్టమ్ ఐపీ చెక్ చేయడంతో పోలీసులు ఈజీగా అతన్ని పట్టుకోగలిగారు. ప్రస్తుతానికి ఫాల్సెట్టి విడుదలయ్యాడు కానీ విచారణ కొనసాగుతోంది. అర్జెంటీనా మీడియా ప్రకారం సుమారు మిలియన్ పెసోల($8,260)ను కొనుగోళ్లకు ఉపయోగించినట్లు తెలుస్తుంది.




Next Story