- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
slimmy discounts : బక్కగున్నోళ్లకు బంపర్ ఆఫర్.. ఈ రెస్టారెంట్‌లో ఫుడ్ ఫ్రీ!
slimmy discounts : బక్కగున్నోళ్లకు బంపర్ ఆఫర్.. ఈ రెస్టారెంట్‌లో ఫుడ్ ఫ్రీ!

దిశ, ఫీచర్స్ : థాయిలాండ్‌లోని ఓ రెస్టారెంట్ బక్కగున్నోళ్లకు బంపర్ ఆఫర్ ఇస్తుంది. చియాంగ్ యామ్‌లోని బ్రేక్ ఫాస్ట్ వరల్డ్ రెస్టారెంట్ వింత ఆఫర్లతో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ రెస్టారెంట్ ముందు మెటల్ బార్స్ ఏర్పాటు చేసి ఇందుకు అనుగుణంగా డిస్కౌంట్ ఇస్తుంది. బాగా సన్నగా ఉన్న బార్ నుంచి దూరగలిగితే 20శాతం డిస్కౌంట్, సన్నగా ఉంటే 15శాతం, కొంచెం లావుగా ఉంటే ఐదు శాతం డిస్కౌంట్ ఇస్తున్న రెస్టారెంట్.. ఆ మెటల్ బార్స్ నుంచి దూరేంత ఫిట్‌గా లేకపోతే ఏ ఆఫర్ ఇవ్వట్లేదు. పూర్తి ధర చెల్లించాలని సూచిస్తుంది.
ఈ విధానం ఆన్‌లైన్‌లో తీవ్ర చర్చను రేకెత్తించింది. కొందరు దీనిని ఫ్యాట్ షేమింగ్‌గా విమర్శించారు. శరీర పరిమాణానికి డిస్కౌంట్‌లను ముడిపెట్టడం అనేది హానికరమైన స్టీరియోటైప్‌లను బలపరుస్తుందని తిట్టిపోస్తున్నారు. మరికొందరు దీనిని మార్కెటింగ్ ట్రిక్‌గా భావిస్తున్నారు. ఈ రెస్టారెంట్ గతంలో అత్యంత సన్నగా ఉన్న కస్టమర్లకు ఉచిత ఆహారం అందించింది. ఇది దీర్ఘకాలంగా కొనసాగుతున్న సాంప్రదాయాన్ని సూచిస్తుంది. డైనింగ్ ఇండస్ట్రీలో ఆరోగ్య స్పృహ, ఆహారం, ఆనందం మధ్య ఉన్న ఉద్రిక్తతను సూచిస్తుంది. వివాదాస్పద మార్కెటింగ్ వ్యూహాలకు దారితీస్తుంది. కాగా థాయ్ సంస్కృతిలో సన్నని శరీరం అందం, ఆరోగ్యం, క్రమశిక్షణతో ముడిపడి ఉంటుంది. ఇది రెస్టారెంట్ ఇటువంటి విధానాన్ని అమలు చేయడానికి కారణం కావొచ్చు. కానీ థాయిలాండ్‌లో కూడా బాడీ డైవర్సిటీ, ఇటువంటి పద్ధతుల ప్రతికూల ప్రభావం గురించి అవగాహన పెరుగుతుంది.






