Meditation : మెడిటేషన్ నిజంగా మంచిదేనా..? ఒత్తిడి, ఆందోళనలు తగ్గుతాయా..?

by Javid Pasha |   (  Updated:2025-06-04 13:08:48  IST  )

Meditation : మెడిటేషన్ నిజంగా మంచిదేనా..? ఒత్తిడి, ఆందోళనలు తగ్గుతాయా..?

Meditation : మెడిటేషన్ నిజంగా మంచిదేనా..? ఒత్తిడి, ఆందోళనలు తగ్గుతాయా..?
X

దిశ, ఫీచర్స్ : మనసు ప్రశాంతంగా లేదా? దేనిపైనా ఏకాగ్రత కుదరడం లేదా? ఒత్తిడితో సతమతం అవుతున్నారా? అయితే మెడిటేషన్ ప్రాక్టీస్ చేయండి ప్రాబ్లం క్లియర్ అవుతుంది! అంటారు చాలా మంది. ఒత్తిడి, ఆందోళలను ఈజీగా తగ్గించే ఖర్చులేని పరిష్కారంగానూ పేర్కొంటారు. కానీ ఇదంతా నిజమేనా? అంటే.. కాదనే అంటున్నాయి కొన్ని అధ్యయనాలు. పైగా ధ్యానం ఎల్లప్పుడూ మంచిది కాదని కూడా పేర్కొంటున్నాయి. ఆ వివరాలేంటో చూద్దాం పదండి!

మైండ్‌ఫుల్‌‌నెస్‌ను ప్రేరేపించడం, ఒత్తిడి ఆందోళనలు తగ్గించడం ఎమో కానీ.. మెడిటేషన్ వీటిని మరింత పెంచుతుందని 2022లో యూ.ఎస్.లో 953 మంది రెగ్యులర్ మెడిటేటర్లపై జరిగిన అధ్యయనం పేర్కొన్నది. పైగా దీని కారణంగా10% కంటే ఎక్కువ మంది కనీసం ఒక నెల రోజుల పాటు ఆందోళన(Anxiety), డిప్రెషన్(depression), డిస్సోసియేషన్(dissociation), అలాగే సైకోసిస్(Psychosis) వంటి ప్రతికూల మానసిక ప్రభావాలను అనుభవించారని వెల్లడించింది. 2020లో 40 సంవత్సరాల పరిశోధన సమీక్ష కూడా మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తున్నవారిలో ఇవే సమస్యలు కనిపించినట్లు తెలిపింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. మెడిటేషన్ ప్రభావాలపై పలువురు డిస్కస్ చేస్తున్నారు.

కొత్త పరిశోధనలు, పెరుగుతున్న ఆధారాలను బట్టి మెడిటేషన్ వాస్తవానికి మరింత సంక్లిష్టమైన(more complicated) సమస్యలకు దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. సర్వసాధారణంగా దీనిని ప్రయోజనకరమైన ప్రాక్టీస్‌గా పేర్కొంటున్నప్పటికీ, నిజానికి ఇది బిలియన్ డాలర్ల వ్యాపారంగా మారిందని, వెల్‌నెస్ మార్కెట్ మెడిటేషన్‌ను కమర్షియలైజ్ (Commercialized) చేసి, సరళీకరించిందని, కీలకమైన భద్రతా అంశాలను విస్మరించిందని విమర్శకులు వాదిస్తున్నారు.

Next Story