Dopamine : డోపమైన్ రిలీజ్.. ఆనందానికే కాదు.. ఆ విషయాల్లోనూ కీ రోల్ పోషిస్తుంది..!

by Javid Pasha |

Dopamine : డోపమైన్ రిలీజ్.. ఆనందానికే కాదు.. ఆ విషయాల్లోనూ కీ రోల్ పోషిస్తుంది..!

Dopamine : డోపమైన్ రిలీజ్.. ఆనందానికే కాదు.. ఆ విషయాల్లోనూ కీ రోల్ పోషిస్తుంది..!
X

దిశ, ఫీచర్స్ : డోపమైన్ అనగానే.. సహజంగా అది హ్యాపీనెస్‌ను కలిగించే హార్మోన్ అనుకుంటాం. ఎందుకంటేఅది రిలీజ్ కావడంవల్లే మనం ఆనందంగా ఉండగలుగుతాం. అధ్యయనాలు సైతం ఇదే పేర్కొంటున్నాయి. అయితే రీసెంట్‌గా నార్త్‌వెస్ట్రన్ యూనివర్సిటీ(Northwestern University) పరిశోధకులు నిర్వహించిన ఒక కొత్త అధ్యయనం మరో ఇంట్రెస్టింగ్ విషయాన్ని వెల్లడించింది. ఏంటంటే..

ఇన్ని రోజులు డోపమైన్ అంటే ఆనందం, సరదా వంటి జాయ్‌ఫుల్ ఫీలింగ్స్‌తో ముడిపడిందనే అందరూ అనుకున్నారు. కానీ ఇది అకస్మాత్తుగా ఎదురయ్యే ప్రమాదాల నుంచి తప్పించుకోవడంలో, వాటిని నివారించడంలో కీ రోల్ పోషిస్తుందని పరిశోధకులు అంటున్నారు. అధ్యయనంలో భాగంగా నార్త్‌ వెస్ట్రన్ యూనివర్సిటీకి చెందిన రీసెర్చర్స్ జంతువులు ఎలక్ట్రిక్ షాక్‌ల నుంచి తప్పించుకునే క్రమంలో ఎస్కేప్ అవడాన్ని పరిశీలిస్తూ.. హై రిజల్యూషన్ బ్రెయిన్ ఇమేజింగ్‌ను ఉపయోగించి ఎలుకలలో డోపమైన్ యాక్టివిటీస్‌ను ట్రాక్ చేశారు. అయితే ఈ కొత్త పరిశోధన ‘డోపమైన డిటాక్స్’ అనే ట్రెండీ ఆలోచనను తోసిపుచ్చి, మరో కొత్త ఆవిష్కరణకు తెరతీసింది.

ఎలుకల్లో డోపమైన్ యాక్టివిటీని పరిశోధకులు పరిశీలిస్తున్నప్పుడు వాటి మెదడులోని రెండు ప్రాంతాలు వెంట్రోమీడియల్ షెల్, అండ్ కోర్ - బెదిరింపు(core responded to threat signals) సంకేతాలకు వ్యతిరేక మార్గాల్లో ప్రతిస్పందించడాన్ని గమనించారు. అయితే అవి ఈ హెచ్చరిక సంకేతాలను ప్రమాదంతో అనుబంధించడం నేర్చుకున్నప్పుడు మెదడులోని మరొక ప్రాంతం బలమైన డోపమైన్ రిలీజ్‌ను చూపించింది. అంటే డోపమైన ఆనందానికే కాదు, ప్రమాదాల నుంచి, భయాల నుంచి తప్పించుకునే ప్రవర్తను, ఆలోచనను ప్రేరేపించడంలోనూ మానవులకు సహాయపడుతుందని పరిశోధకులు నిర్ధారణకు వచ్చారు. అంతేకాకుండా ఈ పరిశోధన యాంగ్జైటీ, అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ (OCD) చికిత్సలకు కొత్తమార్గాలను అన్వేషించడంలో సహాయపడుతుందని చెబుతున్నారు.

Next Story