మహిళల భద్రతలో వైజాగ్ రెండో స్థానం.. మరి హైదరాబాద్..?

by Sujitha Rachapalli |   (  Updated:2025-08-30 18:38:18  IST  )

ప్రతీ ఏడాది నిర్వహించే నారీ (National Annual Report and Index on Women's Safety) సర్వే ఈ సంవత్సరం కూడా నిర్వహించింది. భారతదేశంలో మహిళల భద్రత గురించి నివేదికను అందించింది. 31 నగరాల్లో దాదాపు 12,770 మంది మహిళల

మహిళల భద్రతలో వైజాగ్ రెండో స్థానం.. మరి హైదరాబాద్..?
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రతీ ఏడాది నిర్వహించే నారీ (National Annual Report and Index on Women's Safety) సర్వే ఈ సంవత్సరం కూడా నిర్వహించింది. భారతదేశంలో మహిళల భద్రత గురించి నివేదికను అందించింది. 31 నగరాల్లో దాదాపు 12,770 మంది మహిళల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న Pvalue Analytics సంస్థ.. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని Group of Intellectuals and Academicians (GIA) ద్వారా ప్రచురించింది. నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ చైర్‌పర్సన్ విజయ కిషోర్ రాహత్కర్ ఢిల్లీలో ఇందుకు సంబంధించిన రిపోర్ట్‌ గురించి పూర్తి వివరాలను అందించారు.

* దేశంలోని సురక్షిత నగరాల్లో కోహిమా ఫస్ట్ ప్లేస్‌లో ఉండగా.. సెకండ్ ప్లేస్‌లో విశాఖపట్నం, ఎనిమిదో స్థానంలో హైదరాబాద్ ఉన్నాయి. దిగువ స్థానంలో ఢిల్లీ, కోల్‌కతా, రాంచీ, శ్రీనగర్, ఫరీదాబాద్ నగరాలు ఉన్నాయి.

* అర్బన్ ప్రాంతాల్లో నలభై శాతం మంది మహిళలు భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. అసభ్యకర చూపులు, తాకడం, అసభ్యకరంగా మాట్లాడుతూ వేధిస్తుండగా.. 18-24 ఏళ్ల వయసున్న అమ్మాయిలు ఎక్కువ రిస్క్‌లో ఉన్నారు. ఇరుగుపొరుగు, బంధువులు ఏమనుకుంటారోనని భయపడి.. కేవలం 22శాతం మంది మాత్రమే ఇలాంటి వేధింపుల గురించి ఫిర్యాదు చేశారు.

*ముఖ్యంగా సరిగ్గా లేని పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వ్యవస్థ, రాత్రుల్లో వీధుల్లో లైట్లు లేకపోవడం, మౌళిక సదుపాయాల కొరత ఉమెన్ సెక్యూరిటీని ఎఫెక్ట్ చేస్తుంది.

* వర్క్ ప్లేస్‌లో 53శాతం మంది మహిళలు ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హరాజ్మెంట్ పాలసీ గురించి తెలియదన్నారు.

Next Story