- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Nagasadhuvs: మొఘల్ నియంతను గడగడలాడించిన హిందూ వీరులు.. నాగసాధువులపై స్పెషల్ స్టోరీ!
Nagasadhuvs: 1669 ఏప్రిల్ 9న ఔరంగజేబు జారీ చేసిన ఒక ఉత్తర్వు సాధువుల్లో పట్టరాని కోపాన్ని తెప్పించింది. కూల్చేయాల్సిన జాబితాలో సోమనాథ్ ఆలయం, కాశీ విశ్వనాథ్ మందిరం, మథుర ఆలయాలు కూడా ఉండడం ఔరంగజేబుపై సాధువులు నేరుగా తలపడేలా చేసింది. పూర్తి సమాచారం కోసం ఆర్టికల్ మొత్తం చదవండి.

దిశ, వెబ్ డెస్క్: Nagasadhuvs: శరీరమంతా విభూది... జడలు కట్టిన జుట్టు.. ఒంటిపై దుస్తులు లేకుండా తిరిగే నైజం..! కత్తులు, బాణాలు, ఈటెలు, త్రిశూలాలతో కళను ప్రదర్శించే నేర్పరితనం.. ఇదంతా నాగసాధువుల ప్రత్యేకతలు. మహాకుంభమేళలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా ఉండే నాగాసాధువుల గురించి ఎన్నో చారిత్రక కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ముఖ్యంగా మొఘల్ సామ్రాజాన్ని వణికించిన చరిత్ర నాగసాధువుల సొంతం. వేదాలు, గ్రంథాలను అనుసరించే ఈ నాగ సాధువులు మొఘల్ చక్రవర్తులకు వ్యతిరేకంగా ఆయుధాలు పట్టారని తెలుసా? చరిత్ర ఆధారాల ప్రకారం నాగసాధువులు మొఘల్ రాజు ఔరంగజేబు సైన్యాన్ని వందకు సార్లకు పైగా ఓడించారు. ఇక ఇప్పటికీ వారు ఆధ్యాత్మిక అన్వేషకులే కానీ, వారిలో దాగివున్న యోధుడి లక్షణాలు కూడా ఏ మాత్రం చెక్కుచెదరకపోవడం ఆసక్తిని కలిగించే అంశం.
ఔరంగజేబుతో హోరాహోరీ
క్రీస్తుశకం 8వ, 9వ శతాబ్ధాల మధ్య ఆది శంకరాచార్యుల కాలంలో అఖారా వ్యవస్థ మొదలైంది. ఇక ప్రస్తుతం 13 అఖారాలు ఉన్నాయి. ఇందులోని సాధువుల సంఖ్య దాదాపు 5 లక్షల వరకు ఉంటుంది. అఖారాలో చేరడానికి నాగసాధువులు కఠిన పరీక్షలు, కఠోరమైన సాధనలు చేయడం తప్పనిసరి. ఇక అక్బర్ కాలంలో బ్రాహ్మణులు మాత్రమే సన్యాసులుగా ఉండేవారట. వారు ప్రతీరోజు ఉదయం గంగ స్నానం ఆచరించేవారు. ఆ సమయంలో గంగ స్నానానికి వచ్చే సన్యాసులను ఫకీర్లు చంపేవారని జాన్ నికోల్ అనే మాంచెస్టర్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ రాసిన 'ద ఫైటింగ్ అసెటిక్స్ ఆఫ్ ఇండియా' బుక్ ద్వారా తెలుస్తోంది.
ఇక అక్బర్ తర్వాత కాలంలో సంప్రదాయాలకు భిన్నంగా అన్ని కులాల వారికి అఖారా సంస్థల్లో స్థానం కలిగింది. అయితే ఔరంగజేబు సింహాసనాన్ని అధిష్టించిన తర్వాత సాధువుల కష్టాలు మరింత పెరిగాయని చెబుతారు చరిత్రకారులు. ముఖ్యంగా దేవాలయాలు, గురుకులాలు అన్నింటిని కూల్చేయాలంటూ 1669 ఏప్రిల్ 9న ఔరంగజేబు జారీ చేసిన ఒక ఉత్తర్వు సాధువుల్లో పట్టరాని కోపాన్ని తెప్పించింది. కూల్చేయాల్సిన జాబితాలో సోమనాథ్ ఆలయం, కాశీ విశ్వనాథ్ మందిరం, మథుర ఆలయాలు కూడా ఉండడం ఔరంగజేబుపై సాధువులు నేరుగా తలపడేలా చేసింది. నాటి ఆలయాలను సాధువులే కాపాడారని చరిత్రకారులు చెబుతుంటారు. అందుకే వీరిని హిందూ ధర్మరక్షకులగా అభివర్ణిస్తుంటారు.
ప్రత్యేక శోభ తెచ్చిన వీరులు
ఇక మహాకుంభమేళకు నాగసాధువుల రాక వేళ మరోసారి ఈ అంశాలు చర్చకు దారి తీశాయి. నాగసాధువులు మొఘల్ చక్రవర్తులపై చేసిన పోరాటాన్ని కొందరు హిందువులు గుర్తు చేసుకుంటున్నారు. మహాకుంభమేళలో మంత్రాలను పఠిస్తూ పవిత్ర గంగా నదిలో సాధువులు స్నానం చేశారు. వారి కారణంగా అక్కడ స్నానం చేసే ప్రతి ఒక్కరి పాపాలు పోతాయన్నది భక్తుల విశ్వాసం. ఒక్క మాటలో చెప్పాలంటే నాగసాధువుల ఉనికి ఈ మహా కుంభ మేళాకు ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక శోభను తీసుకొచ్చింది.






