- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బంగారం వెదజల్లుతున్న అందమైన పర్వతం.. రోజుకు ఎంతంటే..!
మౌంట్ ఎరేబస్ అనే పర్వతం ప్రతిరోజూ సుమారు 80 గ్రాముల బంగారు రేణువులను బయటకు వెదజల్లుతూ ఉంటుంది.

దిశ, ఫీచర్స్ : ఎత్తైన కొండలు, అందమైన పర్వత లోయలు ప్రకృతి సౌందర్యానికి ప్రతీకలుగా నిలుస్తుంటాయి. మన దేశంలోనూ, ప్రపంచంలోనే పర్యాటకులను ఆకట్టకునే అలాంటి ప్రదేశాలు చాలానే ఉన్నాయి. అయితే ఆ ప్రాంతంలో ఉన్న ఒక పర్వతం మాత్రం అద్భుతంగా అనిపిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఎందుకంటే అది నిరంతరం బంగారు రేణువులను బయటకు వెదజల్లుతూ ఉంటుంది. ఇంతకీ అదెక్కడుంది అనుకుంటున్నారా? అంటార్కిటికాలోనే.. పేరు ఎరేబస్.
అవును.. అంటార్కిటికాలోని మౌంట్ ఎరేబస్(Mount Erebus) అనే అగ్నిపర్వతం ప్రతిరోజూ సుమారు 80 గ్రాముల బంగారు రేణువులను వాయువుల ద్వారా బయటకు విడుదల చేస్తుంది. ఈ విషయం చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు కానీ.. 1991లోనే శాస్త్రవేత్తలు దీనిని కనుగొన్నారు. NASA Earth Observatory కూడా 2024లో ఈ బంగారం వెదజల్లే పర్వతాన్ని రిపోర్ట్ చేసింది. ఎరేబస్ బంగారు రేణులువులు, చిన్న చిన్న బుడగలనే కాదు.. దాంతోపాటు విలువైన ఇతర ఖనిజాలు కూడా బయటకు విడుదల చేస్తుందని నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) గతంలో పేర్కొన్నది.
నాసా ప్రకారం అంటార్కిటికాలోని ఎరేబస్ అగ్ని పర్వతం భూమి మధ్యలోంచి పైకి ఉబుకుతున్న లావా ద్వారా ఏర్పడింది. ప్రతి రోజూ దాదాపు 80 గ్రాముల బంగారం దాని నుంచి బయటకు వస్తూ ఉంటుందని ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. విషయం ఏంటంటే ఇక్కడ బంగారం బయటకు వెదజల్లుతున్నప్పటికీ, దానిని సేకరించే ధైర్యం ఎవరూ చేయరు. ఎందుకంటే దాని చుట్టూ అత్యంత వేడిగా మరుగుతున్న లావా ఉంటుంది. కాగా కొన్ని బంగారు రేణువులు వాయు పీడనంవల్ల అప్పుడప్పుడూ పైకి ఎగిసిపడుతుంటాయి.






