- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సొంత కొడుకును పెళ్లి చేసుకున్న కన్న తల్లి.. ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చాక..
సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఓ తల్లి అనుకోని పరిస్థితుల్లో సొంత కొడుకును పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆర్థికంగా బలహీనంగా ఉన్న తల్లిదండ్రులు నవజాత శిశువును దత్తతకు ఇచ్చారు. భర్త ఈ పూర్తి ప్రక్రియను దగ్గరుండి చూసుకోగా..

దిశ, వెబ్ డెస్క్ : సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఓ తల్లి అనుకోని పరిస్థితుల్లో సొంత కొడుకును పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆర్థికంగా బలహీనంగా ఉన్న తల్లిదండ్రులు నవజాత శిశువును దత్తతకు ఇచ్చారు. భర్త ఈ పూర్తి ప్రక్రియను దగ్గరుండి చూసుకోగా.. దత్తత తీసుకునేది ఎవరు? కొడుకు ఎక్కడ పెరుగుతాడు? అనే విషయం తల్లికి తెలియదు. మొత్తానికి కాలం గిర్రున తిరగ్గా.. 21 ఏళ్ల తర్వాత.. 2015లో తల్లి, కొడుకు అనుకోకుండా కలిశారు. ప్రేమలో పడిపోయారు. పెళ్లి చేసుకున్నారు. 2016లో మొదటి బిడ్డకు, 2017లో రెండో బిడ్డకు జన్మనిచ్చారు.
అయితే పిల్లల ఫ్యూచర్‌ను ప్లాన్ చేసే క్రమంలో ఇద్దరు.. చట్టపరమైన ప్రక్రియలు చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే డీఎన్ఏ టెస్ట్ కూడా చేయగా.. అతడు తన బయాలాజికల్ సన్ అని తేలింది. ఈ విషయం తెలుసుకున్న ఇద్దరు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఆ తర్వాత విడిపోయారు. మొత్తానికి ఈ న్యూస్ వైరల్ కాగా.. వీరిద్దరికి పుట్టిన పిల్లల పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆలోచిస్తేనే భయం వేస్తుందంటున్నారు నెటిజన్లు. ఏదేమైనా దేవుడు వారిని చల్లగా చూడాలని కోరుకుంటున్నారు.
- Tags
- MOTHER






