Gen Z Memoir : మనసులో అనిపించింది సోషల్ మీడియాలో చెప్పేస్తున్న యూత్!

by Javid Pasha |

మెమోయిర్ అంటే జీవితంలోని నిర్దిష్ట ఘట్టాలను లోతుగా విశ్లేషించి రాసిన వ్యక్తిగత రచనగా ఒకప్పుడు భావించేవారు. కానీ నేటి యువత దాన్ని సోషల్ మీడియా ద్వారా చేస్తోంది.

Gen Z Memoir : మనసులో అనిపించింది సోషల్ మీడియాలో చెప్పేస్తున్న యూత్!
X

దిశ, ఫీచర్స్ : మధురమైన జ్ఞాపకాలు, కష్టాలు, ఆనందాలు, జీవిత ప్రయాణాలు.. ఇలాంటి వ్యక్తిగత అనుభవాలను ఒకప్పుడు పుస్తకాలుగా రాసి, ఆత్మకథలు లేదా మెమోయిర్స్‌గా ప్రచురించేవారు. కానీ సోషల్ మీడియా యుగంలో ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు జెన్ Z యువత తమ జీవిత జ్ఞాపకాలను పుస్తకాలుగా మలచడం కంటే, ఇన్‌స్టాగ్రామ్, థ్రెడ్స్, యూట్యూబ్, ఫేస్‌బుక్ వంటి వేదికల్లో చిన్న చిన్న కథనాలు, వీడియోలు, పాడ్‌కాస్టుల రూపంలో పంచుకోవడానికి ఎక్కువ ఇష్టపడుతోంది. దీనినే ‘Gen Z Memoirs’ అని పిలుస్తున్నారు.

నిజానికి మెమోయిర్ (memoir) అంటే జీవితంలోని నిర్దిష్ట ఘట్టాలను లోతుగా విశ్లేషించి రాసిన వ్యక్తిగత రచనగా ఒకప్పుడు భావించేది. కానీ నేటి యువత దాన్ని సోషల్ మీడియా ద్వారా చేస్తోంది. “నా బాల్యం”, “బ్రేకప్ తర్వాత నా జీవితం”, “మెంటల్ హెల్త్ జర్నీ”, “హనీమూన్ అనుభవాలు”, “కాలేజీ డేస్” వంటి అనుభవాలను వీడియోలు, క్యాప్షన్స్ లేదా లాంగ్ పోస్టుల రూపంలో షేర్ చేస్తున్నారు. ఇన్‌ఫ్లుయెన్సర్లు తమ బ్రాండ్‌ను బలోపేతం చేసుకోవడానికి కూడా ఈ ట్రెండ్‌ను వాడుతున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితం సోషల్ మీడియాలో తెరిచిన పుస్తకంలా ఉంటోంది. ఎవరి ఆనందం, విషాదం, కష్టం, విజయం అయినా ఒక్క క్లిక్‌తో అందరికీ తెలిసేస్తోంది. ఈ ఓపెన్‌నెస్ జెన్ Zని మరింత ధైర్యంగా, ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తోంది. అయితే లోతైన అనుభవాలను సరైన రీతిలో చెప్పగలిగితేనే అది నిజమైన మెమోయిర్ అవుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

Next Story