- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రేమను పెంచుతున్న దూరం..! ఆధునిక జంటల్లో కొత్త ధోరణి
ఆధునిక జంటల్లో లివింగ్ అపార్ట్ టుగెదర్ అనేది ప్రేమలో స్వేచ్ఛకు సంబంధించి కొత్త ఒరవడిగా విస్తరిస్తోంది.

దిశ, ఫీచర్స్ : సాధారణంగా ఎప్పుడూ ఒకే ఇంట్లో లేదా ఒకే రూములో కలిసి నివసించిన జంటల మధ్యే ప్రేమ బలంగా ఉంటుందని, రొమాంటికల్ టచ్ బాగుంటుందని చాలామంది అనుకుంటారు. కానీ ఇది మాత్రమే నిజం కాదంటున్నాయి ఆధునిక జంటలు. ఒకే ఇంటిలో ఉండి కాసేపు కలిసి సమయం గడిపాక వేర్వేరు గదుల్లో నివసించేవారు లేదా వేర్వేరు ఇండ్లల్లో, వేర్వేరు ప్రాంతాల్లో విడిగా నివసించేవారు కూడా అంతకు మించిన ప్రేమను, ఆనందాన్ని అనుభవిస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. దీనినే ‘‘లివింగ్ అపార్ట్ టుగెదర్” (LAT) ట్రెండ్ అని పిలుస్తున్నారు. ఉరుకులూ పరుగుల ఆధునిక జీవితంలో ఇది సర్వసాధారణమైపోతోందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇంతకీ దీనివల్ల కలిగే లాభ నష్టాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
బంధంలో కొత్త ఒరవడి..
లివింగ్ అపార్ట్ టుగెదర్ అనేది వాస్తవానికి ప్రేమలో స్వేచ్ఛకు సంబంధించి కొత్త ఒరవడిగా, రొమాంటిక్ సంబంధాల్లో కొత్త ధోరణిగా విస్తరిస్తోంది. ఈ ట్రెండ్ అసలు ఉద్దేశం భార్యా భర్తలు లేదా ప్రేమికులు దూరంగా ఉండటం కాదు. అవసరమైనప్పుడు మాత్రమే కలుసుకుంటూ.. కలిసి ఉంటూ మిగతా సమయంలో దూరంగా ఉంటూనే పూర్తిగా దగ్గరగా భావిస్తున్న ఆధునిక అనుబంధంగా నిపుణులు పేర్కొంటున్నారు. ఒకప్పుడైతే.. ముఖ్యంగా సాంప్రదాయికంగా భార్యా భర్తలు లేదా సహజీవనం చేస్తున్న జంట ఒకే ఇంట్లో కలిసి ఉండటమే నిజమైన అన్యోన్యతకు, విలువైన సంబంధానికి చిహ్నంగా భావించేవారు. కానీ ఇప్పుడా పరిస్థితులు మారిపోయాయి. వేర్వేరు ప్రాంతాల్లో, దేశాల్లో ఉద్యోగాలు, వ్యాపారాలు వంటివి ఉండటంతో రోజూ కలిసి ఉండేందుకు పలువురికి సెట్ అవ్వదు. అలాంటి వారే ఈ లాట్ ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. ముఖ్యంగా ఆధునిక జీవనశైలి, స్వయం సమృద్ధి(self-sufficiency), సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ లవ్, జెండర్ ఈక్వాలిటీ వంటి అంశాల పట్ల పెరిగిన ఆకర్షణ వల్ల దీనికి మరింత ఆదరణ లభిస్తోంది.
40% అదే ఫాలో అవుతున్నారు
లివింగ్ అపార్ట్ టుగెదర్ ట్రెండ్‌ను నేటి ఆధునిక జంటలు ఎక్కువగా అనుసరిస్తున్నాయి. హాలీవుడ్ నటి గ్వినెత్ పాల్ట్రో కూడా తన భర్త బ్రాడ్ ఫాల్చుక్‌తో వివాహం తర్వాత ఒక సంవత్సరం వారు వేర్వేరు ఇళ్లలో ఉన్నారు. ‘‘ఇది మనల్ని మిస్టరీగా ఉంచుతుంది. ప్రతీ సమయాన్ని ప్రత్యేకంగా మారుస్తుంది’ అని ఆమె పేర్కొన్న వ్యాఖ్యలు గతంలో వైరల్ అయ్యాయి కూడా. ఇక 2022 సంవత్సరం నుంచి 2026 వరకు, వివాహిత జంటల్లో ఈ లివింగ్ టుగెదర్ (LAT) ట్రెండ్‌ను అనుసరించేవారి సంఖ్య 40% పైగా పెరిగింది. ముఖ్యంగా 45 నుంచి 60 ఏండ్లలోపు జంటల్లో ఇది ఎక్కువగా ఉంటోంది. కెనడాలో 9% జంటలు దీనిని ఇష్టపడుతుండగా, యూకేలో 4 మిలియన్ల మంది ఇలాంటి సంబంధాల్లో ఉన్నారు. యూఎస్‌లో 50-64 సంవత్సరాల వయస్సు జంటల్లో 39% మంది, భారత దేశంలో దాదాపు 40% జంటలు లివింగ్ అపార్ట్ టు గెదర్ ట్రెండ్ ఫాలో అవుతున్నట్లు ఆన్‌లైన్ సర్వేలు పేర్కొంటున్నాయి.






