సంబంధాల్లో Personal Space.. మహిళలు ఎందుకు కోరుకుంటారు?

by Javid Pasha |

సామాజిక పరిస్థితులు, ప్రకృతి నియమాలు, శరీర నిర్మాణ శాస్త్రం వంటివి కొన్ని విషయాల్లో పురుషులకంటే కూడా మహిళలకు ఎక్కువగా వ్యక్తిగత అవసరాలను క్రియేట్ చేస్తాయి.

సంబంధాల్లో Personal Space.. మహిళలు ఎందుకు కోరుకుంటారు?
X

దిశ, ఫీచర్స్ : ప్రేమాను బంధాలు ఎంత గాఢంగా పెనవేసుకుపోయినా మనుషులు ఎప్పుడూ సామాజిక జీవులుగానే ఉండలేరు. వ్యక్తిగత భావాలను, వ్యక్తిగత అవసరాలను, వ్యక్తిగత వైఖరులను కలిగి ఉంటారు. కుటుంబ సభ్యుల మధ్య, ప్రేమికుల మధ్య, భార్యా భర్తల మధ్య కూడా ఇది సహజమే. కాబట్టి సందర్భాన్ని బట్టి ఒకరి వ్యక్తిగత అంశాలను సైతం మరొకరు గుర్తించాల్సిన, గౌరవించాల్సిన అవసరం ఉందంటున్నారు మానసిక నిపుణులు. ముఖ్యంగా మహిళల విషయంలో ఇది మరింత అవసరమని చెబుతున్నారు. అదెలాగో చూద్దాం పదండి

సామాజిక పరిస్థితులు, ప్రకృతి నియమాలు, శరీర నిర్మాణ శాస్త్రం వంటివి కొన్ని విషయాల్లో పురుషులకంటే కూడా మహిళలకు ఎక్కువగా వ్యక్తిగత అవసరాలను క్రియేట్ చేస్తాయి. అందుకే రిలేషన్‌షిప్‌లోనూ ఈ పరిస్థితిని గుర్తించినప్పుడే, మహిళలను అర్థం చేసుకున్నప్పుడు ఆ బంధం, ఆ కుటుంబం సంతోషంగా ఉండగలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అధ్యయనాలు సైతం ఇదే పేర్కొంటున్నాయి. ఉదాహరణకు ఒక మహిళ తన భాగస్వామితో ‘నన్ను కాసేపు ఒంటరిగా ఉండనివ్వండి’ అన్నప్పుడు ఇక్కడ భర్తకు కొన్నిసార్లు అనుమానించే అవకాశం ఉంటుంది. తనను తిరస్కరిస్తున్నదని కూడా భావించవచ్చు. అయితే ఇలా అనుకోవడం చాలా వరకు అవగాహన రాహిత్యమే అంటున్నారు నిపుణులు.

‘పర్సనల్ స్పేస్’ ప్రతి ఒక్కరికీ అవసరం ఉంటుంది. మహిళలకు మరింత ఎక్కువ అవసరం కూడా కావచ్చు. ఈ విధమైన వ్యక్తిగత విషయాలు, అవసరాల ప్రాముఖ్యత అర్థం చేసుకోగలిగిన పురుషులనే మహిళలు ఇష్టపడతారు. పైగా పర్సనల్ స్పేస్ అనేది ఒక మహిళ వ్యక్తిగత అవసరానికి, ఆత్మాభిమానానికి నిదర్శనం కూడా. మానసిక అలసట నుంచో, మరేదైనా కారణంతోనో ఆమె ప్రశాంతత కోరుకొని ఉండవచ్చు. అందుకే ఒక మహిళ కాసేపు ఒంటరి తనం కోరుకోవడమంటే కుటుంబాన్నో, భాగస్వామినో తిరస్కరించినట్టు కాదు. తాను ఒత్తిడిని ఎదుర్కోవడానికో, తన శక్తి సామర్థ్యాలను మరింత ఎక్కువగా ఉపయోగించుకోవడానికో అని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు నిపుణులు.

Next Story