- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పగటి నిద్ర పనికి ఆటంకం కలిగిస్తోందా?.. అయితే ఇలా చేయండి !
పగటిపూట నిద్దుర అనేక పనులకు ఆటంకం కలిగిస్తుంది. అందుకే ‘పగటిపూట నిద్దుర పనికి చేటు’ అంటుంటారు

దిశ, ఫీచర్స్: పగటిపూట నిద్దుర అనేక పనులకు ఆటంకం కలిగిస్తుంది. అందుకే ‘పగటిపూట నిద్దుర పనికి చేటు’ అంటుంటారు పెద్దలు. ముఖ్యంగా ఈ సమస్య సమ్మర్‌లోనే చాలామందిని వేధిస్తుంది. ప్రయాణం చేస్తున్నా, ఆఫీసు వర్కులో ఉన్నా మనకు తెలియకుండానే నిద్రమబ్బు కమ్మేస్తుంది. మగతగా అనిపిస్తూ ఉంటుంది. ఇటువంటి పరిస్థితి ఏకాగ్రతను దెబ్బతీస్తుందని, పనిలో నాణ్యత తగ్గేలా చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకిలా జరుగుతుంది? ఇదేమైనా ఆరోగ్య సమస్యా? నివారణ ఎలా? అనే సందేహాలు కూడా పలువురిని వెంటాడుతుంటాయి.
హర్మోన్ ప్రభావం
వాస్తవానికి మనం నిద్రపోవడానికి, అతినిద్ర సమస్యకు ప్రధాన కారణం శరీరంలో ఉత్పత్తి అయ్యే మెలటోనిన్(Melatonin) హార్మోన్. ఇది సూర్యకాంతి ద్వారా సహజంగానే లభిస్తుంది. అయితే సమ్మర్‌లో ఎండలు ఎక్కువగా ఉండటం మూలంగా ఈ హార్మోన్ సాధారణంకంటే అధికంగా ఉత్పత్తి అవుతుంది. అదే సందర్భంలో ఉక్కబోతల కారణంగా మన శరీరంలోని నీరు, లవణాలు చెమటరూపంలో బయటకు పోతాయి. ఫలితంగా ఎనర్జీ తగ్గి, అలసటకు దారితీస్తుంది. ఈ పరిస్థితే పగటిపూట నిద్ర రావడానికి కారణం అవుతుందని వైద్య నిపుణులు చెప్తున్నారు. అయితే కొన్ని జాగ్రత్తలు, చిట్కాలతో ఈ సమస్యను అధిగమించవచ్చు.
ఇలా తప్పించుకోండి
మెలటోన్ హార్మోన్ పెరగడానికి ప్రధాన కారణం ఎండ, కాబట్టి ఎక్కువ సేపు ఎండలో ఉండకుండా చూసుకోవాలి. కొన్నిసార్లు ఎండలో కొద్దిసేపే ఉన్నప్పటికీ అధిక ఉష్ణో గ్రతల కారణంగా శరీరంలో శక్తి తగ్గిపోతుంది. సూర్యరశ్మికి గురికావడంవల్ల డీహైడ్రేషన్ ప్రాబ్లం కూడా తలెత్తుంది. మగతగా అనిపించడం, బద్ధకం ఆవహించడం, అలసట పెరగడం గమనించవచ్చు. నిద్రమత్తు ఆవహించడానికి ఈ పరిస్థితి దారితీస్తుంది. అందుకే ఎండకు గురికాకుండా ఉండటంవల్ల సమ్మర్‌లో అతినిద్ర సమస్యను అధిగమించవచ్చు అంటున్నారు వైద్య నిపుణులు. అదే విధంగా నిద్రలేమి సమస్య ఉన్నవారిలో కూడా ఎండకారణంగా పగటి నిద్ర సమస్య ఏర్పడుతుంది. కాబట్టి రోజూ రాత్రిపూట తగినంతగా నిద్రపోయేలా చూసుకోవాలి. వీకెండ్స్‌లోనూ ఈ అలవాటును మార్చుకోవద్దు. ఫలితంగా డే టైమ్ స్లీపింగ్‌కు చెక్ పెట్టవచ్చు.
నీళ్లు ఎక్కువగా తాగండి
సమ్మర్‌లో డీహైడ్రేషన్ సమస్య తలెత్తే అవకాశాలు ఎక్కువుంటాయి. ఎండవల్ల అలసిపోవడం, శరీరం బలహీనంగా మారడంవల్ల నిద్రలోకి జారుకుంటుంటారు. ఇటువంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు బాడీలో వాటర్ పర్సంటేజ్ తగినంతగా ఉండాలి. ప్రతిరోజూ ఎక్కువగా నీళ్లు తాగడంతోపాటు తాజా పండ్ల పండ్లరసాలు, మజ్జిగ, నిమ్మరసం వంటివి కూడా తీసుకోవచ్చు. దీనివల్ల మీలో నిద్ర మగత తగ్గిపోయి, చురుకుదనం పెరుగుతుంది. అలాగే కెఫిన్, ఆల్కహాల్ వంటివి నివారించాలి.
బ్లడ్ ప్రెషర్ నియంత్రణ, వ్యాయామం
రెగ్యులర్‌గా వ్యాయామం చేయడంవల్ల బాడీ ఫిట్‌నెస్‌తో మెంటల్లీ యాక్టివ్‌గా ఉండగలుగుతారు. పగటిపూట నిద్రపోయే పరిస్థితిని, అలసటను డైలీ ఎక్సర్ సైజ్‌తో నివారించవచ్చు. అయితే వ్యాయామం కేవలం ఉదయంవేళ సూర్యరశ్మికి ముందు మాత్రమే చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. స్విమ్మింగ్ కూడా వ్యాయామంలో భాగమే. సమ్మర్‌లో పగటిపూట నిద్రకులో మరో కారణం బ్లడ్ ప్రెషర్ కూడా.ఎందుకంటే రక్తపోటు తగ్గడమనేది శారీరక బలహీనతకు, అలసటకు దారితీస్తుంది. అందుకే బీపీ కంట్రోల్లో ఉండేలా తగిన ఆహారం తీసుకోవడంతోపాటు ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడం, జాగ్రత్తలు తీసుకోవడం బెటర్.






