మీలో ఆ లక్షణాలు కనిపిస్తున్నాయా?.. డయాబెటిస్‌కు సంకేతం కావచ్చు!

by Disha Web Desk 10 |
మీలో ఆ లక్షణాలు కనిపిస్తున్నాయా?.. డయాబెటిస్‌కు సంకేతం కావచ్చు!
X

దిశ, ఫీచర్స్: డయాబెటిస్ అనేది ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక మందిని ప్రభావితం చేస్తున్న ఆరోగ్య సమస్యల్లో ఒకటి. జీవన శైలి మార్పులు, ఆహారపు అవాట్లు, జెనెటిక్ హిస్టరీ వంటివి దీనికి కారణం అవుతున్నాయి. ఒక్కసారి వచ్చిందంటే ఇది పూర్తిగా నయం కాదు. కేవలం దాని లక్షణాలను మాత్రమే మెడికేషన్ ద్వారా తగ్గించగలమని వైద్య నిపుణులు చెప్తున్నారు. అందుకే మధుమేహం బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక వంశపారంపర్యంగా కొందరికి తప్పకుండా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రారంభంలోనే గుర్తించి తగిన మందులు వాడటం ద్వారా దానివల్ల తలెత్తే ఇతర ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు.

ఎక్కువసార్లు మూత్ర విసర్జన

శరీరంలో జరిగే మార్పుల ద్వారా ప్రారంభ లక్షణాలను గుర్తించవచ్చు. తరచుగా అత్యధిక సార్లు మూత్ర విసర్జనకు వెళ్లాలనిపించడం దీని స్టార్టింగ్ సింప్టమ్‌గా పేర్కొనవచ్చు. బ్లడ్‌లో షుగర్ లెవల్స్ పెరిగినప్పుడు, కిడ్నీలు యూరిన్‌లోని అదనపు గ్లూకోజ్‌ను ఫిల్టర్ చేయడం ద్వారా తొలగించే ప్రయత్నం చేస్తాయి. దీనివల్ల డయాబెటిస్ ప్రారంభ దశలో వ్యక్తులు సాధారణంకంటే ఎక్కువసార్లు యూరిన్‌కు వెళ్లే సమస్యను ఎదుర్కొంటారు.

చర్మ సమస్యలు, బ్రీతింగ్ స్మెల్

చర్మంలో అంతకుముందెన్నడూ లేని మార్పులు కనిపించవచ్చు. క్రమంగా అకాంథోసిస్ నైగ్రికన్స్ పరిస్థితికి దారితీస్తుంది. దీనివల్ల మెడ భాగంలో, చంకల్లో చర్మం పాలిపోయినట్లు కనిపించడం, మందంగా మారడం కూడా డయాబెటిస్ ప్రారంభ లక్షణాల్లో ఒకటి. దీంతోపాటు నోటిలో లాలాజంల ఉత్పత్తి తగ్గి, తరచుగా నాలుక పొడిబారుతుంది. దంతాలు, చిగుళ్ల సమస్యలు కూడా ఈ కారణంగా అధికం కావచ్చు. మరికొందరిలో బ్రీతింగ్‌ సమయంలో ఏదో దుర్వాసన వచ్చిన ఫీలింగ్ కలుగుతుంది. దీనిని డయాబెటిక్ కీటో యాసిడ్స్ అని కూడా పిలుస్తారు. బాడీ ఇన్సులిన్‌ను సక్రమంగా యూజ్ చేసుకోలేని పరిస్థితిలో ఎనర్జీకోసం ఫ్యాట్స్‌ను విచ్ఛిన్నం చేసే ప్రక్రియలో భాగంగా కీటోన్స్ విడులవుతాయి.

తల తిరగడం, అజీర్తి సమస్యలు

తరచుగా తలతిరగడం, వికారంగా అనిపించడం డయాబెటిస్ ప్రారంభం అవుతుందని చెప్పడానికి సంకేతం. దీంతోపాటు జీర్ణ వ్యవస్థ పనితీరు కూడా మందగిస్తుంది. రక్తంలో షుగర్ లెవల్స్ పెరిగి, గ్యాస్ట్రోపరేసిస్‌కు దారితీయడం కారణంగా అజీర్తి, వివకారం, కొన్ని సందర్భాల్లో వాంతింగ్స్ వంటివి జరగవచ్చు. అంతేగాక హై షుగర్ లెవల్స్‌వల్ల నరాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. అందుకే ప్రారంభంలో తరచుగా కాళ్లల్లో నొప్పులు, తిమ్మిరి వంటివి మధుమేహం ప్రారంభ లక్షణాలుగా చెప్పవచ్చు. మొత్తానికి డయాబెటిస్ అనేది బాడీలో ఇమ్యూనిటీ పవర్‌ను దెబ్బతీస్తుంది. కాబట్టి వివిధ అనారోగ్యాల బారిన పడే అవకాశం ఎక్కువ. అందుకే ముందు జాగ్రత్తలు తీసుకోవడంవల్ల, అలాగే ప్రారంభంలో లక్షణాలను గుర్తించి వైద్య నిపుణుల సలహాతో మందులు వాడటం, జీవన శైలిని మార్చుకోవడం వంటి చర్యలతో డయాబెటిస్ కారణంగా తలెత్తే దీర్ఘకాలిక ప్రమాదాలను నివారించవచ్చు.


Next Story