- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Meat eaters : మాంసాహారులు వందేళ్లు జీవించే అవకాశం ఎక్కువ!
మాంసాహారులతో పోలిస్తే.. శాకాహారులైన వృద్ధులు వందేళ్లు జీవించే అవకాశాలు తక్కువగా ఉన్నాయని ఒక అధ్యయనం పేర్కొన్నది

దిశ, ఫీచర్స్ : ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక మంది ఇష్టపడే ముఖ్యమైన ఆహారాల్లో మాంసాహారం ఒకటి. అయితే శాకాహారం తినేవారికంటే కూడా మాంసాహారం తినే వృద్ధులు వందేండ్లు జీవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చైనాలో జరిగిన ఒక అధ్యయనం(Chinese Longitudinal Healthy Longevity Survey - CLHLS) పేర్కొన్నది. వాస్తవానికి ఈ అధ్యయనం 1998లో ప్రారంభమై 2018 వరకు కొనసాగింది. ఇందులో భాగంగా నిపుణులు 80 సంవత్సరాలు.. అంతకంటే ఎక్కువ వయసు కలిగిన మొత్తం 5,203 మందిని వృద్ధుల ఆహారపు అలవాట్లు, వారి దీర్ఘాయుష్షుపై చూపే ప్రభావాన్ని పరిశీలించగా.. మాంసాహారులైన వృద్ధుల్లో ఎక్కువమంది వందేండ్లు పైబడి జీవిస్తున్నట్లు గుర్తించారు. ఇందకు సంబంధించిన వివరాలు 2025 డిసెంబర్‌లో అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూ్ట్రిషన్‌లోనూ పబ్లిష్ అయ్యాయి.
దీర్ఘకాలిక వ్యాధులు దూరం!
చైనీస్ అధ్యయనాల ప్రకారం.. మాంసాహారుల(Omnivores)తో పోలిస్తే.. వెజిటేరియన్స్ అండ్ వీగన్స్(Vegans)లో వందేండ్లు(Centenarian ) జీవించే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా అండర్ వెయిట్ (కనీస బరువు తక్కువ ఉన్నవారు)లో మాంసాహారం తినడంవల్ల ఎక్కువకాలం జీవిస్తారు. ఇక చేపలు తినేవారు (పెస్కో-వెజిటేరియన్స్), అలాగే గుడ్లు, పాలు, డెయిరీ ఆధారిత ఫుడ్స్ (ఓవో-లాక్టో-వెజిటేరియన్స్ )తినేవారు మాంసాహారులతో సమానంగా జీవిస్తున్నారని. కానీ కేవలం మొక్క ఆధారిత ఆహారాలు మాత్రమే తినేవారిలో కూడా ఎక్కువకాలం జీవించే అవకాశాలు తక్కువగా (odds rati 0.71) ఉన్నాయి. కేవలం వీగన్ డైట్స్ మిడిల్ ఏజ్‌లో హార్ట్ డిసీజ్, డయాబెటిస్ వంంటి క్రానిక్ డిసీజెస్ నివారణకు ఉపయోపగపడుతున్నప్పటికీ, వృద్ధాప్యంలో మాత్రం అంత ఎఫెక్టివ్‌గా పనిచేయడం లేదు. అంటే ఈ వయసులో బయాలజికల్ అవసరాలు మారుతాయని స్టడీ హైలెట్ చేస్తున్నది.
కారణమేమిటి?
నిజానికి వృద్ధులకు కండర ద్రవ్యవరాశి, ఎముకల సాంద్రత(muscle mass and bone density) మెయింటైన్ చేయడం చాలా ముఖ్యం. వృద్ధాప్యంలో జీర్ణశక్తి కాస్త తక్కువగా ఉన్నప్పటికీ, మాంసం, గుడ్లు, డెయిరీ వంటి యానిమల్ ప్రొడక్ట్స్ తక్కువ తక్కువ ఎక్కువసార్లు తినడం, మెత్తగా వండేసి తినడం వంటివి మేలు చేస్తాయి. ముఖ్యంగా ఇవి ప్రోటీన్స్ అండ్ ఎసెన్షియల్ న్యూట్రియెంట్స్ (విటమిన్ B12, D)ను డెన్స్ సోర్స్‌గా అందిస్తాయి. కేవలం మొక్కల ఆధారిత ఆహారాల ద్వారా ఇవి అంత సలుభంగా అందవు. అయితే ఇదంతా అండర్ వెయిట్ వృద్ధులకు లేదా వ్యక్తులకు మాత్రమే ఎక్కువగా మేలు చేస్తుంది. ఇండియాకు కూడా ఇది వర్తిస్తుందని నిపుణులు చెబుతున్నారు.






