- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
True love : ఇది కదా నిజమైన లవ్ అంటే.. హాప్పిటల్ క్లీనర్‌ను ప్రేమించి పెండ్లి చేసుకున్న MBBS డాక్టర్..!
True love : ఇది కదా నిజమైన లవ్ అంటే.. హాప్పిటల్ క్లీనర్‌ను ప్రేమించి పెండ్లి చేసుకున్న ఎంబీబీఎస్ డాక్టర్..!

దిశ, ఫీచర్స్ : ప్రేమంటే మనసుకు నచ్చితే చాలు అంటుంటారు సాధారణంగా. కానీ ఇది వందశాతం కరెక్ట్ అని చెప్పడం కష్టం! ఎందుకంటే ఈ రోజుల్లో ప్రేమలు ఇట్లనే ఉంటున్నాయంటున్నారు పెద్దలు, నిపుణులు సైతం. అవతలి వ్యక్తిలో మంచి మనసు చూసేవారికంటే చేస్తున్న ఉద్యోగం, సామాజిక హోదా, ఆర్థిక పరిస్థితులు వంటివి గమనించి ప్రేమలో పడిపోతున్న వారే ఎక్కువని చెబుతుంటారు. కానీ అందరూ అట్లనే ఉంటరని కూడా అనుకోవాల్సిన అవసరం లేదు. కొందరు భిన్నంగా ఉంటారు. ఆ కోవకే చెందుతారు ఎంబీబీఎస్ డాక్టర్ కిశ్వర్ సాహిబా (Kishwar Sahiba).. ఎందుకంటే ఆమె తన హాస్పిటల్‌లో పనిచేసే హౌస్ కీపింగ్ ఉద్యోగిని ప్రేమించింది. ఆ వివరాలేంటో చూద్దామా !
ఒక వ్యక్తిని ప్రేమించాలంటే సవాలక్షసార్లు ఆలోచిస్తారు చాలా మంది. ఇక ఐదంకెల జీతమో, డిమాండ్ గల ప్రొఫెషనో, గొప్ప స్టేటస్ ఉన్నవారో అయితే మరింత జాగ్రత్త పడుతుంటారు. ఒక విధంగా చెప్పాలంటే వీరు తమకంటే తక్కువస్థాయి వ్యక్తులను ప్రేమించాలని అనుకోరట. స్టేటస్‌లో, డబ్బులో, చేస్తున్న ఉద్యోగంలో తమకు సమానంగా లేదా అంతకంటే ఎక్కువ ఉండాలని చూస్తారు. కానీ ఎంబీబీఎస్ డాక్టర్ కిశ్వర్ సాహిబా మాత్రం అలా కాదు. ఆమె తన హాస్పిటల్‌లో హౌస్ కీపింగ్ సిబ్బందిలో ఒకరైన షాహ్‌జాద్(Shahzad)ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకోగా వైరల్ అవుతోంది.
షాహ్‌జాద్‌లో తనకు కేవలం చాయ్ వాలా, క్లీనరే కనిపించలేదని, పనిపట్ల అతని శ్రద్ధ, అంకిత భావం, నిష్కపటమైన ప్రవర్తన తనను ఆకర్షించాయని, ముఖ్యంగా క్లీనింగ్ చేసే స్టైల్ (Sweeping style) తనకు బాగా నచ్చించదని చెప్పుకొచ్చిందిడాక్టర్ కిశ్వర్ సాహిబా. ఈ క్రమంలోనే ఆమె తన మనసులో మాటను షాహ్‌జాద్‌కు చెప్పగా మొదట అతను ఆశ్చర్యపోయాడు. ఆమెను నివారించే ప్రయత్నం చేశాడు. డాక్టర్ అయి ఉండి ఒక హాస్పిటల్ క్లీనర్‌కు ప్రపోజ్ చేయడమేంటని వెంటనే అతను నమ్మలేదు. కానీ కిశ్వర్ సాహిబా తాను నిజంగానే ప్రేమిస్తున్నట్లు తెలుపగా, చివరికి ఓకే చెప్పేశాడు. ఈ విషయాలన్నీ వివరిస్తూ సాహిబా సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, తెగ వైరల్ అవుతోంది. ఇది కదా నిజమైన ప్రేమంటే అని నెటిజన్లు సైతం ఆశ్చర్యపోతున్నారు.






