ప్రపంచ ఉత్తమ రెస్టారెంట్ల జాబితాలో మాస్క్‌.. ఇండియా నుంచి ఒక్కటే!

by Yella Dhawani Reddy |   (  Updated:2025-06-06 14:11:19  IST  )

ముంబైకు చెందిన మాస్క్ (Masque) రెస్టారెంట్ మరోసారి అరుదైన ఘనతను సాధించింది.

ప్రపంచ ఉత్తమ రెస్టారెంట్ల జాబితాలో మాస్క్‌.. ఇండియా నుంచి ఒక్కటే!
X

దిశ, వెబ్ డెస్క్: ముంబైకు చెందిన మాస్క్ (Masque) రెస్టారెంట్ మరోసారి అరుదైన ఘనతను సాధించింది. ప్రపంచ ఉత్తమ రెస్టారెంట్ల (Restaurants) జాబితాలో చోటు దక్కించుకుంది. 2025 సంవత్సరానికి గాను విడుదల చేసిన ప్రపంచ ఉత్తమ రెస్టారెంట్ల జాబితాలో 68వ స్థానాన్ని పొందింది. ఆసియాలోని తొమ్మిది రెస్టారెంట్లకు మాత్రమే ఈ గౌరవం లభించగా, భారతదేశం నుంచి ఎంపికైన ఏకైక రెస్టారెంట్‌గా మాస్క్ నిలిచింది. ప్రపంచంలోని 50 ఉత్తమ రెస్టారెంట్లు 51 - 100 వరకు ర్యాంక్ పొందిన జాబితా తాజాగా వెల్లడైంది. ఈ జాబితాలో ఆరు ఖండాల్లోని 37 నగరాల్లోని రెస్టారెంట్లు ఉన్నాయి. గత ఏడాది ఈ జాబితాలో తొలిసారి ఎంట్రీ ఇచ్చిన మాస్క్‌ 78వ స్థానంలో నిలవగా.. ఈ ఏడాది 10 స్థానాలు ముందుకు ఎగబాకింది.

ఇక 2016లో స్థాపించబడిన మాస్క్.. ప్రారంభం నుంచే ఫ్యూషన్ ఫుడ్‌, వినూత్న మెనూలు, స్థానికంగా లభించే ఆహార పదార్థాల వినియోగం వంటి అంశాలతో ప్రత్యేక గుర్తింపు సాధించింది. 2025 సంవత్సరానికి ఆసియాలోని 50 ఉత్తమ రెస్టారెంట్ల జాబితాలో మాస్క్ 19వ స్థానంలో నిలిచింది. అలాగే ఈ సంవత్సరం దేశంలోని ఉత్తమ రెస్టారెంట్‌గా ఎంపికైంది. అదే జాబితా ర్యాంకింగ్‌ల ఆధారంగా ఇది అనేకసార్లు దేశంలోని అగ్రశ్రేణి రెస్టారెంట్‌గా అవతరించింది. 2025 సంవత్సరానికి ఆసియా జాబితాలోని మరొక భారతీయ ఎంట్రీ ఇండియన్ యాక్సెంట్ ఢిల్లీ 46వ స్థానంలో నిలిచింది. కాగా, ఇటీవలి కాలంలో భారతదేశంలో ఉన్న ఏ రెస్టారెంట్ కూడా 50 ఉత్తమ జాబితాలో చోటు దక్కించుకోకపోయినా, విదేశాల్లోని భారతీయ వంటకాలకు మంచి గుర్తింపు లభిస్తుంది.

Next Story