ముఖ సౌందర్యాన్ని పెంచే కొరియన్ బ్యూటీ కేర్.. ఇలా చేశారంటే తళ తళా మెరిసిపోవాల్సిందే..

by Javid Pasha |
ముఖ సౌందర్యాన్ని పెంచే కొరియన్ బ్యూటీ కేర్.. ఇలా చేశారంటే తళ తళా మెరిసిపోవాల్సిందే..
X

దిశ, ఫీచర్స్ : ‘అందంగా మెరిసిపోవాలా?.. అయితే కొరియన్ బ్యూటీ కేర్ ఫాల్లో అవండి’ అనే మాటలు ఇటీవల తరచుగా వినిపిస్తు్న్నాయి. చూడటానికి కొరియన్ యువతీ యువకులు స్కిన్ టోన్ కూడా అందంగా, ఫ్లా లెస్‌గా, స్మూత్‌గా ఉంటుంది. కాబట్టి ఇది అద్భుతంగా పనిచేస్తుందని చాలా మంది భావిస్తు్న్నారు. దీంతో మార్కెట్లో దొరికే కొరియన్ బ్యూటీ ప్రొడక్ట్స్ వాడటానికి, చర్మ సంరక్షణ టిప్స్ పాటించడానికి ఆసక్తి చూపుతున్నారు. అందులో ఏముంటుంది? ఎలా పనిచేస్తాయో చూద్దాం.

డెప్త్ క్లెన్సింగ్‌

కొరియన్ స్కిన్ కేర్‌లో డెప్త్ లేదా డబుల్ క్లెన్సింగ్ ఒకటి. స్కిన్ టోన్‌ను అందంగా మార్చడంలో ఇది ప్రసిద్ధి చెందింది. స్కిన్ అప్పర్ లేయర్స్‌ను బాగా ఎక్స్‌ఫోలియేటెడ్ చేయడానికి డబుల్ క్లెన్సింగ్ చేస్తారు. ఇందులో భాగంగా మొదట ఆయిల్‌తో కూడిన క్లెన్సర్ అప్లయ్ చేసి, ఆ తర్వాత నీటితో శుభ్రం చేస్తారు. ఇది చర్మంపైన మురికిని, డెత్ స్కిన్‌ను, మేకప్‌ను, జిడ్డును తొలగించి తళ తళా మెరిసేలా చేస్తుంది.

కె - బ్యూటీ స్కిన్

వివిధ కారణాలవల్ల ముఖంలోని చర్మం పైపొర కూడా డీహైడ్రేషన్‌కు గురవుతుంది. ఫలితంగా ముఖ వర్ఛస్సు తగ్గుతుంది. ఈ పరిస్థితిని నివారించడానికి కొరియన్ స్కిన్ హైడ్రేషన్ లేదా కె. బ్యూటీ టిప్స్ అద్భుతంగా పనిచేస్తాయి. సోయాబీన్స్, బియ్యం, పులియబెట్టిన వివిధ పదార్థాల ద్వారా తయారు చేసిన ఉత్పత్తులను ఈ సందర్భంగా వాడుతారు. ఇవి చర్మ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. ప్రస్తుతం కొరియన్ బయో రీమోడలింగ్, హైడ్రో స్ట్రెచ్ థెరపీలు కూడా ప్రసిద్ధి చెందాయి.

యాంటీ ఇన్‌ఫ్లమేటరీగా..

కొరియన్ బ్యూటీ ప్రొడక్ట్స్‌లో విటమిన్ సి, గ్రీన్ టీ, నియాసినామైడ్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు కలిగిన పదార్థాలు ఉంటాయి. ఇవి చర్మ అలెర్జీలను, మంటను నివారిస్తాయి. డెత్‌ సెల్స్‌ను పోగొట్టడం ద్వారా చర్మ సౌందర్యాన్ని ఇనుమడింపజేస్తాయి. వృద్ధాప్య ఛాయలు రాకుండా, చర్మం ముడతలు పడకుండా అడ్డకుంటాయి. దీంతోపాటు హైలురోనిక్ యాసిడ్, బొగ్గు, ముత్యాలు, కొల్లాజెన్, దోసకాయ, నత్త వంటి అనేక సహజ సిద్ధమైన ఉత్పత్తులు కొరియన్ బ్యూటీకేర్‌లో భాగంగా ఉంటాయి. ఇవన్నీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా అందాన్ని, గ్లాసీగా మెరిసే చర్మ సౌందర్యాన్ని పెంచుతాయి. అందుకే ఇప్పుడు చాలామంది కొరియన్ బ్యూటీ ట్రెండ్స్ వైపు ఆసక్తి చూపుతున్నారు.

Next Story

Most Viewed