- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చిరోప్రాక్టిక్ నెక్ అడ్జస్ట్‌మెంట్.. యువకుడికి లైఫ్ లాంగ్ లాక్‌డ్-ఇన్ సిండ్రోమ్.. అసలేంటి ఇది?
చిరోప్రాక్టిక్ నెక్ అడ్జస్ట్‌మెంట్ కోసం వెళ్లిన యువకుడి జీవితం ఒక్కసారిగా తలకిందులైంది. 2015లో జరిగిన ఓ ప్రమాదంలో జొనథన్ బక్కెలూ అనే వ్యక్తి బ్రెయిన్‌స్టెం స్ట్రోక్ కి గురయ్యి, దీర్ఘకాలిక లాక్‌డ్-ఇన్ సిండ్రోమ్ (Locked in Syndrome) అనే అరుదైన న్యూమాలజికల్ పరిస్థితిలోకి వెళ్లిపోయాడు.

దిశ, వెబ్‌డెస్క్: చిరోప్రాక్టిక్ నెక్ అడ్జస్ట్‌మెంట్ కోసం వెళ్లిన యువకుడి జీవితం ఒక్కసారిగా తలకిందులైంది. 2015లో జరిగిన ఓ ప్రమాదంలో జొనథన్ బక్కెలూ అనే వ్యక్తి బ్రెయిన్‌స్టెం స్ట్రోక్ కి గురయ్యి, దీర్ఘకాలిక లాక్‌డ్-ఇన్ సిండ్రోమ్ (Locked in Syndrome) అనే అరుదైన న్యూమాలజికల్ పరిస్థితిలోకి వెళ్లిపోయాడు.
2015 అక్టోబర్ 26న.. జొనథన్ బక్కెలూ (అప్పుడు 20ల్లో ఉన్నారు) అమెరికాలోని జార్జియాలో ఒక చిరోప్రాక్టర్ దగ్గర నెక్ అడ్జస్ట్‌మెంట్ చేయించుకుంటున్న సమయంలో ఫిట్స్ వచ్చి, ఆయన స్పందించలేకపోయారు. వెంటనే నార్త్ ఫల్టన్ హాస్పిటల్ కు తరలించగా.. బ్రెయిన్‌స్టెమ్ స్ట్రోక్ ని డాక్టర్లు ఒక రోజంతా గుర్తించలేదు. ఇది తీవ్రమైన పరిణామాలకు దారి తీసింది. దాంతో ఆయనకు Locked-In Syndrome వచ్చింది. ఇది ఒక రకమైన నాడీ సంబంధ వ్యాధి, ఇందులో వ్యక్తి పూర్తిగా శారీరకంగా ప్యారలైజ్ అవుతారు. కేవలం కళ్ళు మాత్రమే కదపగలుగుతారు.
లాక్‌డ్-ఇన్ సిండ్రోమ్ అంటే ఏమిటి?
Locked-In Syndrome (LIS) అనేది బ్రెయిన్‌స్టెమ్ డామేజ్ కారణంగా ఏర్పడే అరుదైన న్యూరోలాజికల్ కండిషన్. దీనికి గురైనప్పుడు వ్యక్తికి చేతులు, కాళ్లు, శరీరం మొత్తం ప్యారలైజ్ అవుతుంది. ఈ కండీషన్ ను Quadriplegia అంటారు. మాట్లాడటం, మింగటం వంటి బల్బర్ పనితీరు (Bulbar palsy)పై తీవ్రమైన ప్రభావం ఉంటుంది. కానీ.. తెలివితేటలు, వినికిడి, కళ్ల కదలికలు మాత్రం సరిగ్గా పనిచేస్తుంటాయి. ఈ సిండ్రోమ్ సాధారణంగా పురుషులలో 30-50 ఏళ్ల మధ్య వయస్సులో ప్రారంభమవుతుంది. ఇది ఒక బాధాకరమైన స్థితి. వ్యక్తి పూర్తిగా శుద్ధి ఉండగా.. శరీరం మాత్రం పూర్తిగా నియంత్రణ తప్పిపోతుంది.
National Library of Medicine ప్రకారం.. ఈ రుగ్మతను త్వరితంగా గుర్తించి, సపోర్టివ్ కేర్, రీహాబిలిటేషన్ ఇస్తే పేషెంట్‌కి కొంత మెరుగుదల చేకూరుతుందని నిపుణులు చెబుతున్నారు. కానీ జొనథన్ కేసులో.. ఆలస్యం వల్ల ఈ అవకాశాలు కోల్పోయినట్టు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒక చిన్న వైద్య ప్రక్రియను కూడా పూర్తి జాగ్రత్తగా పరిశీలించకపోతే.. జీవితాన్ని శాశ్వతంగా మార్చేసే ప్రమాదం ఉంది. చిరోప్రాక్టిక్ లేదా ఇతర ప్రత్యామ్నాయ చికిత్సలకు వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, అనుభవజ్ఞులైన వైద్యులను మాత్రమే సంప్రదించడం ఎంతో అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.






