ప్రేమ మానసికమైనదే కాదు.. శారీరక నొప్పిని తగ్గించడంలోనూ ఔషధంలా పనిచేస్తుంది..!

by Javid Pasha |

ప్రేమ మానసికమైనదే కాదు.. శారీరక నొప్పిని తగ్గించడంలోనూ ఔషధంలా పనిచేస్తుంది..!

ప్రేమ మానసికమైనదే కాదు.. శారీరక నొప్పిని తగ్గించడంలోనూ ఔషధంలా పనిచేస్తుంది..!
X

దిశ, ఫీచర్స్ : మనుషుల మధ్య ప్రేమ చాలా వరకు మానసికమైన భావనగా పేర్కొంటారు పెద్దలు. ఇది ఆనందానికి, ఆరోగ్యకరమైన జీవితానికి దారితీస్తుందని చెబుతుంటారు. అయితే ఇది అంతవరకే పరిమితం కాదని, మనిషి జీవితంలోని అనేక అంశాలతో ముడిపడి ఉంటుందని స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ అధ్యయనం పేర్కొన్నది. ప్రేమ శారీరక నొప్పిని తగ్గించే ఔషధంగానూ పనిచేస్తుందని స్పష్టం చేసింది. అదెలాగో చూద్దామా!

ఒక వ్యక్తి ఏదైనా శారీరక నొప్పిని అనుభవిస్తున్నప్పుడు ప్రేమించిన వ్యక్తి లేదా భాగస్వామి దగ్గరగా ఉండటం, ఆ క్షణంలో లేకపోయినప్పటికీ వారి ఫొటోను ఒక్క క్షణం పాటు చూడటం వంటివి మానసిక శ్రేయస్సును మెరుగు పర్చడమే కాదు, ఈ పరిస్థితి బాధిత వ్యక్తి మెదడులోని రివార్డ్ సిస్టమ్‌ను యాక్టివేట్ చేయడం ద్వారా శారీరక నొప్పిని కూడా తగ్గిస్తుందని స్టాన్‌ఫోర్డ్ పరిశోధకులు కనుగొన్నారు. అధ్యయనంలో భాగంగా తేలికపాటి శారీర నొప్పికి గురైన వ్యక్తులకు, వారి భాగస్వామి లేదా ప్రేమించిన వ్యక్తి ఫొటోను చూపడం ద్వారా రియల్ టైమ్ ఫలితాన్ని అంచనా వేయగా నొప్పి తీవ్రత 10-15% తగ్గినట్లు గుర్తించారు.

ప్రియమైన వ్యక్తి ఫోటోను చూసినప్పుడు నొప్పిని అనుభవిస్తున్న బాధిత వ్యక్తి మెదడులోని వెంట్రోమీడియల్ ప్రీఫ్రంటల్ కార్టెక్స్, అలాగే న్యూక్లియస్ అకంబెన్స్ వంటి రివార్డ్ రిలేటెడ్ ఏరియాస్ (Reward-related areas become activated.) యాక్టివేట్ కావడం, వెంటనే డోపమైన్ హార్మోన్లను రిలీజ్ కావడం నొప్పిని తగ్గించడంలో కీ రోల్ పోషిస్తాయని పరిశోధకులు అంటున్నారు. కేవలం ఫొటోనే కాదు ప్రేమించిన వ్యక్తి వాట్సాప్ డీపీని చూడటం, ఫోన్‌లో వాల్‌పేపర్‌గా సెట్ చేసుకున్న ఫొటోను చూడటం కూడా ఇదే విధమైన ప్రభావాన్ని కలిగిస్తాయని, మానసిక ఒత్తిడి నుంచి, శారీరక నొప్పి నుంచి ఉపశమనాన్ని కలిగిస్తాయని పరిశోధకులు పేర్కొన్నారు. Link

Next Story