జూన్ 21న సుదీర్ఘమైన పగటి కాలం.. ‘విటమిన్-D డే’ ప్రత్యేకతలు ఇవే

by Malleboina Mahesh |

జూన్ 21న ఏడాదిలోనే అత్యంత సుదీర్ఘమైన పగలు (13 గం. 10 ని.)నమోదు కానుంది. ఈ రోజును 'విటమిన్-D డే ఆఫ్ ఇండియా'గా ప్రకటించిన ఐఎంఏ.

జూన్ 21న సుదీర్ఘమైన పగటి కాలం.. ‘విటమిన్-D డే’ ప్రత్యేకతలు ఇవే
X

దిశ, వెబ్ డెస్క్: ఈ ఏడాది జూన్ 21 (ఆదివారం) సుదీర్ఘమైన పగటి కాలం ఉండే రోజుగా రికార్డు సృష్టించనుంది. ఖగోళ శాస్త్రంలో దీనిని ‘సమ్మర్ సొల్‌స్టిస్’ (Summer Solstice), ఉత్తరాయన అంత్యదశగా పిలుస్తారు. భూమి సూర్యుని చుట్టూ తిరిగే పరిభ్రమణ ప్రక్రియలో భాగంగా, ఈ నిర్దిష్ట సమయంలో భూమి యొక్క ఉత్తర అర్ధగోళం సూర్యుడి వైపు ఎక్కువగా వంగి ఉంటుంది. దీనివల్ల సూర్యకిరణాలు నేరుగా పడి, భారతదేశంలో ఈ రోజున ఏకంగా 13 గంటల 10 నిమిషాల పాటు పగటి సమయం సుదీర్ఘంగా కొనసాగుతుంది. దీంతో దీనిని సాధారణ రోజుల కంటే ఎక్కువ సమయం సూర్యకాంతి లభించే అరుదైన రోజని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఈ ఖగోళ విశేషాన్ని పురస్కరించుకుని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఏటా వచ్చే ఈ జూన్ 21వ తేదీని ‘విటమిన్-D డే ఆఫ్ ఇండియా’ (Vitamin-D Day of India) గా పరిగణించాలని ఐఎంఏ ప్రకటించింది. మానవ శరీరానికి విటమిన్-డి ఎంత అవసరమనే అంశంపై, అలాగే ఉదయం పూట లభించే సహజ సిద్ధమైన సూర్యకాంతి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఐఎంఏ ఈ నిర్ణయం తీసుకుంది. ఎముకల బలానికి, రోగనిరోధక శక్తి పెంపునకు దోహదపడే విటమిన్-డి లోపాన్ని అధిగమించడానికి సూర్యరశ్మిని ఉపయోగించుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Next Story