బాధలో ఉన్నారా..? విషాద గీతాలు వినండి..! ఎందుకంటే..

by Javid Pasha |

బాధలో ఉన్నారా..? విషాద గీతాలు వినండి..! ఎందుకంటే..
X

దిశ, ఫీచర్స్ : ఎప్పుడూ సంతోషాలూ సరదాలే కాదు, మనిషన్నాక అప్పుడప్పుడు బాధలూ దుఃఖాలు కూడా వేధిస్తుంటాయి. నిజానికి ఇవి కూడా మేలు చేస్తుంటాయని, విషాద భావనల నుంచి, సమస్యలను నుంచి బయటపడేందుకు ఓదార్పునిస్తుంటాయని పెద్దలు చెబుతుంటారు. కాగా యూనివర్సిటీ ఆఫ్ కెంట్ అండ్ యూనివర్సిటీ ఆఫ్ లిమెరిక్ నిర్వహించిన అధ్యయనంలోనూ అదే వెల్లడైంది. బాధలో ఉన్నప్పుడు విచారకరమైన(Sad) సంగీతం లేదా పాటలు వినడం మానసిక ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపుతుందని తేలింది. ఆ వివరాలేమిటో ఇప్పుడు చూద్దాం.

మనసులో బాధగా ఉన్నప్పుడు నేనున్నానే భరోసా లేదా ఓదార్పునిచ్చే మాటలు ఎంతో మేలు చేస్తాయి. అయితే విచారకరమైన పాటల్లోనూ అవి మిళితమై ఉంటాయి. పైగా వాటికి శ్రావ్యమైన సంగీతం జోడించబడి ఉంటుంది. కాబట్టి బాధాకరమైన పాటలు లేదా విషాద గీతాలు వినడంవల్ల మెదడులోని రికార్డ్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుందని పరిశోధకులు కనుగొన్నారు. పైగా ఇవి బాధను మేనేజ్ చేయడానికి అవసరమైన డోమపమైన్, ఆక్సిటోసిన్ వంటి హార్మోన్ల విడుదలను ప్రేరేపిస్తాయి. ఈ పరిస్థితి వల్ల బాధను అనుభవించడంలో మీరు ఒంటరిగా లేనట్లు భావించేలా అనుభూతికి లోనవుతారు. అంతేకాకుండా మ్యూజిక్ ప్రతికూల భావోద్వేగాలను పెంచడానికి బదులు, వాటిని ప్రాసెస్ చేయడానికి ఒక సురక్షితమైన స్పేస్‌ను క్రియేట్ చేస్తుంది. దీనివల్ల మనసుకు ఓదార్పు లభించి, ఒత్తిడి నుంచి రిలీఫ్ పొందుతారు. ఇది నెగెటివ్ థాట్స్ తగ్గిపోయి, మానసిక వికాసానికి దారితీస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.

Next Story