- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. పుట్టగొడుగుల సాగుతో ఫుల్ బిజినెస్.!
ఒక చిన్న ప్రయోగం నుంచి ఒక విప్లవాత్మక వ్యాపారంగా రూపాంతరం చెందింది

దిశ, ఫీచర్స్: నాగాలాండ్‌లోని ఫేక్ జిల్లాకు చెందిన 37 ఏళ్ల ల్హూవెవోలూ ఎ రాఖో రసాయన రహిత షిటాకే మష్రూమ్‌లను ఓక్ కొయ్యలపై సాగు చేస్తూ "నేటివ్ ఆర్గానిక్స్" బ్రాండ్‌తో దేశవ్యాప్తంగా విలువ ఆధారిత ఉత్పత్తులను అందిస్తోంది. ఆరోగ్యకరమైన ఆహారం కోసం 2019లో ప్రారంభించిన ఒక చిన్న ప్రయోగం నుంచి ఒక విప్లవాత్మక వ్యాపారంగా రూపాంతరం చెందింది.
కుటుంబ ఆరోగ్యం కోసం..
షిటాకే మష్రూమ్‌లు ప్రత్యేకమైన రుచి, ఆరోగ్య ప్రయోజనాలతో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. వీటిలో విటమిన్ బీ5, డైటరీ కాపర్ ఉండటమే కాకుండా వంటకాల్లో మాంసకృత్తుల రుచిని అందిస్తాయి. సూప్‌లు, రిసోటోలు, బ్రోత్‌లు, సీజనింగ్‌లలో ఈ మష్రూమ్‌లు రుచిని మరింత ప్రత్యేకంగా మారుస్తాయి. 2019లో మాస్ కమ్యూనికేషన్స్ గ్రాడ్యుయేట్ చేసిన ల్హూవెవోలూ తన కుటుంబం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలనే ఉద్దేశంతో ప్రయోగాలు చేస్తుండగా మష్రూమ్ రెసిపీల గురించి తెలుసుకుంది. అప్పటివరకు రిటైల్ వ్యాపారంలో నిమగ్నమైన తనకు ఈ అవకాశం బాగా కలిసొచ్చింది.
లాంగ్ కుమార్ పరిచయం
మష్రూమ్ సాగు ఆర్థికంగా లాభదాయకమని గ్రహించింది ల్హూవెవోలూ. తనకు నిజమైన ప్రేరణ కాంగర్ అగ్రిటెక్‌కు చెందిన డాక్టర్ సోసాంగ్ లాంగ్‌కుమర్. 2018లో నాగాలాండ్‌లో షిటాకే మష్రూమ్‌ల సాగును పరిచయం చేసిన డాక్టర్ లాంగ్‌కుమర్ ఈశాన్య రాష్ట్రంలో "మష్రూమ్-ప్రెన్యూర్"ల ఉద్భవానికి బాటలు వేశాడు. ఆయన స్థాపించిన కాంగర్ అగ్రిటెక్ 500 మందికి పైగా రైతులకు షిటాకే, ఓయిస్టర్ మష్రూమ్ సాగు శిక్షణ ఇచ్చింది. వారు సుమారు 20,00,000 షిటాకే డోవెల్ స్పాన్‌లు, 25,000 కిలోల ఓయిస్టర్ మష్రూమ్ స్పాన్‌లను ఉత్పత్తి చేశారు. ఇది ల్హూవెవోలూను మష్రూమ్ సాగు దిశగా ఆలోచింపజేసింది.
షిటాకే స్పెషాలిటీ
2018కి ముందు ప్రభుత్వ ల్యాబ్‌లు శీతాకాలంలో మాత్రమే మష్రూమ్ స్పాన్‌లను ఉత్పత్తి చేసేవి. ఏడాది పొడవునా మష్రూమ్ స్పాన్‌ల లభ్యత, రైతులకు సాగు విజ్ఞానాన్ని అందించేందుకు లాంగ్ కుమార్ అవకాశం కల్పించాడు. ఆ అవకాశం పొందినవారిలో ల్హూవెవోలూ ఒకరు. డిమాండ్, రుచి, ఔషధ గుణాలున్న స్థానిక వాతావరణానికి అనువైన షిటాకే మష్రూమ్‌ను సాగు చేయాలని నిర్ణయించుకుంది. షిటాకే మష్రూమ్‌లు హార్డ్‌వుడ్ చెట్లపై పెరుగుతాయి. వీటిలో టెర్పెనాయిడ్స్, లిపిడ్స్ ఉండటం వల్ల రోగనిరోధక శక్తిని పెంచడం, క్యాన్సర్‌ను ఎదుర్కునే ఔషధ గుణాలున్నాయి.
లాభసాటి వ్యాపారంగా..
నేటివ్ ఆర్గానిక్స్ ద్వారా 4000కు పైగా ఫ్రూటింగ్ ఓక్ లాగ్‌లను ఏర్పాటుచేసింది. కోత తర్వాత, మష్రూమ్‌లను ఎండబెట్టి పొడి రూపంలో చేసి ఢిల్లీ, ముంబై, బెంగళూరు, పుణె, చెన్నయ్ వంటి నగరాలకు విక్రయిస్తుంది. జూన్, జులై, అక్టోబర్‌లలో కోత సీజన్‌లో ఆర్డర్లు గరిష్ఠ స్థాయిలో ఉంటాయి. ఉత్పత్తుల్లో స్మోక్డ్ షిటాకే పొడి, షిటాకే చట్నీ, చిల్లీ ఫ్లేక్స్ వంటివి ఉన్నాయి. ఇవి 75 గ్రాముల జార్‌కు ₹500 ధర కలిగి ఉన్నాయి. వ్యాపారంలో ఎలాంటి శిక్షణ లేకుం విజయం సాధించింది. ల్హూవెవోలూ ఈ ప్రయాణం చిన్న ఆలోచన నుంచి ప్రారంభమై నాగాలాండ్‌లో ఒక విప్లవాత్మక వ్యాపారంగా రూపాంతరం చెందింది.






