Lemon Water : నిమ్మ‌కాయ నీరు వారికి విషంతో స‌మానం.. అస్స‌లు తాగ‌కండి..!

by Ratna Kumari |   (  Updated:2025-12-11 06:27:21  IST  )

Lemon Water : సాధార‌ణం ప్ర‌తిరోజు చాలా మంది ఉద‌యం వేళ‌లో నిమ్మ‌ర‌సం క‌లిపిన‌టువంటి గోరు వెచ్చ‌ని నీరు తాగుతుంటారు.

Lemon Water : నిమ్మ‌కాయ నీరు వారికి విషంతో స‌మానం.. అస్స‌లు తాగ‌కండి..!
X

Lemon Water : సాధార‌ణం ప్ర‌తిరోజు చాలా మంది ఉద‌యం వేళ‌లో నిమ్మ‌ర‌సం క‌లిపిన‌టువంటి గోరు వెచ్చ‌ని నీరు తాగుతుంటారు. ఇలా తాగ‌డం వ‌ల్ల శ‌రీరానికి చాలా మంచిది అని.. ట్యాక్సిన్స్ ని తొల‌గిస్తుంద‌ని, ఇమ్యూనిటి ప‌వ‌ర్ పెంచుతుంద‌ని అంద‌రూ భావిస్తుంటారు. వాస్త‌వం చెప్పాలంటే నిమ్మ‌కాయ నీరు జీర్ణ‌వ్య‌వ‌స్థ‌ను చురుకుగా ఉంచ‌డంలో చ‌ర్మం మెర‌వ‌డంలో, మెట‌బాలిజాన్ని పెంచ‌డంలో స‌హాయ‌ప‌డుతుంది. కానీ ఇది అంద‌రికీ వ‌ర్తించ‌ద‌నే విష‌యాన్ని గుర్తుంచుకోవాలి. నిమ్మ‌కాయలో ఉండే ఆమ్ల‌త్వం కొన్ని ప‌రిస్థితుల్లో శ‌రీరానికి ఇబ్బంది కావ‌చ్చు. కాబ‌ట్టి దీనిని ఎవ్వ‌రు తాగాలి..? ఎవ్వ‌రు మానేయ్యాల‌నే విష‌యం ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

ఎసిడిటి లేదా దంతాల స‌మ‌స్య‌లు ఉన్న వారికి నిమ్మ‌కాయ నీరు ప్ర‌మాద‌క‌రం. ప్ర‌ధానంగా క‌డుపు సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధప‌డే వారు నిమ్మ‌ర‌సం కి దూరంగా ఉండ‌టం ఉత్త‌మం. ముఖ్యంగా గ్యాస్ట్రిక్ స‌మ‌స్య‌లు ఉన్న వారు నిమ్మ‌కాయ నీటికి దూరంగా ఉండాల‌ని వైద్యులు సూచిస్తున్నారు. నిమ్మ‌కాయ‌లో ఉండే ఆమ్లం క‌డుపు గోడ‌ల‌ను రెచ్చ‌గొట్ట‌డం వ‌ల్ల గుండెల్లో మంట‌, యాసిడ్ రిఫ్ల‌క్స్, క‌డుపు ఉబ్బ‌రం, వికారం వంటి స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. అల్స‌ర్స్ ఉన్న‌వారికి ఈ ప‌రిస్థితి మ‌రింత దిగ‌జార్చే అవ‌కాశం ఉంది. అదేవిధంగా దంతాలు బ‌ల‌హీనంగా ఉన్న వారు కూడా నిమ్మ‌కాయ ర‌సానికి దూరంగా ఉండాలి. నిమ్మ‌లోని ఆమ్లం దంతాల ఎనామెల్ ను నెమ్మది నెమ్మ‌దిగా ధ్వంసం చేస్తుంది. ప‌ళ్ల‌నొప్పి, కావిటీస్, దంతాల సున్నిత‌త్వం వంటివి వ‌చ్చే అవ‌కాశం ఉంది. కాబ‌ట్టి దంతాల స‌మ‌స్య‌లు ఉన్న వారు ఈ నీటిని త‌గ్గించ‌డం లేదా మానేయ‌డం ఉత్త‌మం. కాబట్టి ఈ స‌మ‌స్య‌లు ఉన్న వారు నిమ్మ‌ర‌సానికి దూరంగా ఉండ‌టం బెట‌ర్.

Next Story