- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఒకే ఒక్కడు.. నగరాలకు ఆక్సీజన్ అందిస్తున్నాడు.!
తవక్కం అనే చిన్న ప్రయత్నం ఇప్పుడు రెండు పెద్ద నగరాలకు ఊపిరితిత్తిగా మారింది

దిశ, ఫీచర్స్: కాంక్రీటు జంగిల్ మధ్య గాలి సలపని నగరాల్లో ప్రకృతిని పరిచయం చేస్తు్న్నాడొక వ్యక్తి. చెన్నయ్.. హైదరాబాద్‌లోని ఖాళీ భూములను ఆకుపచ్చ అడవులుగా మారుస్తూ.. మట్టిని బ్రతికిస్తూ.. మనుషులు చెట్లకు మధ్య బలమైన బంధాన్ని ఏర్పరుస్తున్నాడు కృష్ణకుమార్ ఎస్. తవక్కం అనే చిన్న ప్రయత్నం ఇప్పుడు రెండు పెద్ద నగరాలకు ఊపిరితిత్తి మారింది.
1800 మంది వాలంటీర్లు..
కాలేజీ చదివే రోజుల్లో కృష్ణకుమార్ తన స్నేహితులతో కలిసి చెన్నయ్‌లో మొక్కలు నాటే చిన్న కార్యక్రమం ప్రారంభించాడు. ఆ కార్యక్రమం పేరు తవక్కం. తవక్కం అంటే మొదలు అని అర్థం. కేవలం మొక్కలునాటి చేతులు దులుపుకునే కార్యక్రమం కాదిది. నగరానికి ఆక్సిజన్ ఇచ్చే పెద్ద ఉద్యమానికి తొలి అడుగు అన్నమాట. అంత చిన్నగా ప్రారంభమైన తవక్కం ఇప్పుడు ఎంతో విస్తరించింది. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి 1800 మంది వాలంటీర్లు సేవలందిస్తు్న్నారు. 14 మంది టీమ్ నిర్వహణ సభ్యులున్నాు. దీనికి సీఈఓగా సేవలందిస్తూ కృష్ణకుమార్ కార్యక్రమాలను ముందుండి నడిపిస్తున్నాడు.
అకిరా మియావాకి స్ఫూర్తితో..
జపాన్ శాస్త్రవేత్త అకిరా మియావాకి అభివృద్ధి చేసిన పద్ధతిని తవక్కం అనుసరిస్తోంది. మొక్కలు.. పొదలను దగ్గరగా నాటి సహజ అడవి సృష్టిస్తున్నారు. వీరు పెట్టిన మొక్కలు చెట్లుగా మారి పర్యావరణ పరిరక్షణకు ఎంతగానో తోడ్పడుతున్నాయి. ఈ చెట్లు సాధారణ అటవీ వృక్షాలకంటే 10 రెట్లు వేగంగా పెరుగుతాయి. మట్టి.. సారం నిర్వహణ సక్రమంగా ఉంటే ఈ చిన్నపాటి అడవులే తమంత తాము బతికి పెద్ద అడవిగా మారుతుందని కృష్ణకుమార్ చెప్తున్నాడు. ముగలివక్కం.. షోలింగనల్లూర్.. ఓమందూరార్ ఆస్పత్రి ప్రాంతాల్లో 10కి పైగా మియావాకి అడవులు సృష్టించారు.
తుఫాను సమయంలోనూ..
తమిళనాడు మొత్తం 25కి పైగా మియావాకి అడవులను సృష్టించాడు కృష్ణ కుమార్. 65 వేలకు పైగా స్థానిక మొక్కలను నాటారు. మట్టి సమస్యలు వచ్చినా వాటిని అధిగమించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు. ప్రభుత్వ అనుమతులు.. భూమి సేకరణ.. నీటి కొరత వంటి సవాళ్లు ఎన్ని వచ్చినా కార్యక్రమాన్ని మాత్రం ఆపలేదు. ఉదాహరణకు 2016లో వార్దా తుఫాను చెన్నయ్ నగరాన్ని ముంచెత్తింది. వందలాది చెట్ల నేల కూలాయి. ఎన్నో రోజులుగా పడ్డ కష్టమంతా నేలపాలైంది. కానీ తవక్కం ఆగలేదు. మరింత ఉత్సాహంతో పనిచేసి యువతను దీంట్లో భాగస్వాములను చేసింది.
5 లక్షల మొక్కల లక్ష్యం..
చెన్నయ్ ప్రేరణతో హైదరాబాద్‌లోనూ చెరువుల వద్ద మియావాకి అడవులను పెంచడం ప్రారంభించాడు కృష్ణకుమార్. వీటివల్ల గాలి శుద్ధి అవుతోంది. భూగర్భజలాలు మెరుగవుతున్నాయి. భూమి వేడి తగ్గుతోంది. పక్షులు పునరావాసం పొందుతున్నాయి. ఈ అడవుల్లో ఆక్వా.. సోలార్ దీపాలు.. ఆట స్థలాలు ఏర్పాటుచేశారు. స్థానికులకు పరిరక్షణ బాధ్యతలు అప్పగించారు. ఈ చెట్లకు పండ్లు.. కాయలు కాస్తే వాటిని ప్రభుత్వ పాఠశాలలకు పంపిస్తూ కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నారు. తవక్కం ఇప్పుడు బెంగళూరు.. ఢిల్లీకి విస్తరిస్తోంది. 2025 పూర్తయ్యే నాటికి 5 లక్షల మొక్కల లక్ష్యం పెట్టుకున్నారు.






