- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆర్థిక క్రమశిక్షణ కోసం రెరా కీలక మార్పులు
ప్రాజెక్టుకు మూడు అకౌంట్లు

రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులో ఆర్థిక నేరాలను అరికట్టడంతోపాటు ఆర్థిక క్రమశిక్షణ కోసం తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ ఆథారిటీ (టీజీరెరా) కీలక మార్పులు తీసుకొచ్చింది. రిజిస్టర్డ్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుకు సంబంధించి సపరేట్ బ్యాంకు అకౌంట్ నిర్వహణలో నిబంధనలు తీసుకొచ్చింది. గతంలో ఒక ప్రాజెక్టుకు ఒకే బ్యాంకు అకౌంట్ ఉండేది. దీంతో ఆర్థికపరమైన సమస్యలు రావడంతోపాటు పారదర్శకత లోపాలున్నట్టు రెరా గుర్తించింది. దీంతో రియల్ ఎస్టేట్ (రెగ్యులేషన్ అండ్ డెవలప్ మెంట్) 2016 చట్టం ప్రకారం మూడు అకౌంట్లు తప్పనిసరిగా ఉండాలని నిర్ణయించారు. 9 సెప్టెంబర్ 2024 నుంచి మూడు అకౌంట్ల విధానం కొనసాగుతుంది.
- దిశ, తెలంగాణ బ్యూరో
మొదటిది : కలెక్షన్ అకౌంట్. ప్రాజెక్టులోని అలాటీస్ నుంచి వచ్చే ఫండ్స్ 100 శాతం ఇందులోనే జమ చేయాల్సి ఉంటుంది. ఈ అకౌంట్ పై ప్రాజెక్టు ఓనర్ ఎలాంటి హక్కులుండవు. దీన్ని నేరుగా బ్యాంకులే ఆపరేట్ చేస్తాయి. ఈ అకౌంట్ కు సంబంధించి ప్రాజెక్ట్ ఓనర్ డెబిట్, క్రెడిట్ లావాదేవీలకు ఎలాంటి అవకాశంలేదు.
రెండోది : కలెక్షన్ అకౌంట్ నుంచి 70శాతం నిధులు ఆటోమెటిక్ గా బదిలీ అవుతాయి. ఎప్పటికప్పుడు లావాదేవీలు జరుగుతూనే ఉంటాయి. ఈ అకౌంట్ నుంచే ప్రాజెక్టు ఖర్చులు, భూమికి సంబంధించిన ఖర్చులు చేయాల్సి ఉంటుంది.
మూడోది : కలెక్షన్ అకౌంట్ నుంచి 30శాతం నిధులు మూడో అకౌంట్ లోకి వస్తాయి. 30శాతం నిధులను మిస్ లీనియస్ ఖర్చులకు వినియోగించుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆదాయపన్నులు, ఇతర నిర్వహణ ఖర్చుల కోసం వినియోగించుకోవాల్సి ఉంటుంది.
ఆ ముగ్గురి ఆమోదంతోనే..
రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు కోసం ఓపెన్ సపరేట్ అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేసుకోవాలంటే రియల్ ఎస్టేట్ (రెగ్యులేషన్, డవలప్ మెంట్-2016 చట్టంలోని సెక్షన్4(2)(1)(డీ) ప్రకారం ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ప్రాజెక్టు ఇంజినీర్, ఆర్కిటెక్ట్, చార్టెడ్ అకౌంటెంట్ సర్టిఫైడ్ చేయాల్సిందే. వీరిలో ఏ ఒక్కరి సర్టిఫికేషన్ లేకపోయినా విత్ డ్రా కుదరదని టీజీరెరా చైర్మెన్ సత్యనారాయణ తెలిపారు.






