- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మేనకోడలి చేతి సైగలు అర్థం కావడం లేదని.. అతనేం చేశాడంటే..!
దానిని ధరించి సంజ్ఞలతో మాట్లాడుతున్నప్పుడు సంబంధిత సంకేతాలు ఒక మైక్రోకంట్రోలర్‌కు చేరుతాయి.

దిశ, ఫీచర్స్ : కొన్నిసార్లు ఇబ్బందికరమైన అనుభవాలు సైతం కొత్త ఆలోచనలకు దారితీస్తుంటాయి. సరి కొత్త అవకాశాలనో, అద్భుతాలనో క్రియేట్ చేస్తుంటాయి. కెన్యాకు చెందిన రాయ్ అల్లెలా (Roy Allela) అనే హార్డ్‌వేర్+ఎంబెడెడ్ సిస్టమ్స్ ఇంజినీర్ జీవితంలోనూ సరిగ్గా అదే జరిగింది. తన మేనకోడలు పుట్టుకతో మూగ కావడంతో ఇతరులతో మాట్లాడటానికి ఇబ్బంది పడటాన్ని చూసి చలించిపోయిన అతను, ఈ సమస్యకు పరిష్కారంగా ఒక స్మార్ట్ గ్లోవ్(Smart glove)ను తయారు చేశాడు.
రాయ్ అలెల్లాకు, ఆరేండ్ల వయసులో ఉన్న తన మేనకోడలంటే ఎంతో ఇష్టం. కానీ ఆ చిన్నారి పుట్టుకతో మూగ కావడంతో మాటలు వచ్చేది కాదు. కేవలం చేతి సైగల(సంజ్ఞలు)తో మాట్లాడేది. దీంతో కుటుంబ సభ్యులకు, ఇతరులకు ఆ చిన్నారి మనసులో మాటను అర్థం చేసుకోవడంలో ఇబ్బందిగా ఉండేది. ఇది తరచుగా గమనించిన అల్లెలాకు కూడా బాధ అనిపించేది. దీంతో ఆమె మనసులోని భావాలను అందరికీ అర్థమయ్యే మార్గం కోసం ఆలోచించడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలోనే.. చేతి కదలికలు & సంజ్ఞలను గుర్తించి, ఆడియోగా మార్చగల సెన్సార్లను అమర్చి Sign-IO అనే గ్లోవ్‌ను అభివృద్ధి చేశాడు. దీనిని ధరించి చేతులను ఊపుతూ సంజ్ఞలతో మాట్లాడుతున్నప్పుడు సంబంధిత సంకేతాలు ఒక మైక్రోకంట్రోలర్‌కు చేరుతాయి. అది ఈ నమూనాలను ప్రాసెస్ చేసి, ఒక స్పీకర్ ద్వారా వాటిని ఆడియోగా మారుస్తుంది. సింపుల్‌గా చెప్పాలంటే ఈ గ్లోవ్ చేతి కదలికలను గ్రహించి, ఇతరులు వినగలిగే మాటలుగా మారుస్తుంది. ఓ ఇంజినీర్ మేనకోడలు సమస్య నుంచి ఆవిష్కరించబడిన ఈ సాంకేతికత ఎంతోమందిని ఆశ్చర్య పరిచింది. ప్రపంచ వ్యాప్తంగా మాటలు రానివారికోసం దానిని అప్లై చేసే విధానంపై సాంకేతిక నిపుణులు దృష్టి కేంద్రీకరించారు.






