- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Health tips : వేసవిలో అధిక అలసట వేధిస్తోందా..? ఇది తప్పక తినాల్సిందే అయితే..
Health tips : వేసవిలో అధిక అలసట వేధిస్తోందా..? ఇది తప్పక తినాల్సిందే అయితే..

దిశ, ఫీచర్స్ : వేసవిలో చాలామంది ఎదుర్కొనే ఇబ్బందుల్లో అధిక అలసట ఒకటి. ఉష్ణోగ్రతల్లో మార్పులు, ఉక్కబోతలు పెరగడం ఇందుకు కారణం అవుతుంది. దీంతోపాటు డీహైడ్రేషన్, తలనొప్పి వంటి సమస్యలు కూడా వస్తుంటాయి. అయితే సమ్మర్‌లో వీటి నుంచి తక్షణ ఉపశమనం కలిగించడంల కీరదోస అద్భుతంగా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఆహారంలో భాగంగా చేర్చుకోవాలని సూచిస్తున్నారు. దానివల్ల కలిగే ఉపయోగాలేమిటో చూద్దాం.
కీరదోసే కదా అనుకోకండి. వేసవిలో ఇది చేసే మేలు అంతా ఇంతా కాదు. భోజన సమయంలో సలాడ్ రూపంలోనూ దీనిని తీసుకోవచ్చు. ఇందులో ఆరోగ్యానికి అవసరమైన విటమిన్లు, ఔషధ గుణాలు ఉంటాయి. దీనిని పచ్చిగాను తినవచ్చు. మరో ముఖ్య విషయం ఏంటంటే.. కీర దోసను ప్రపంచంలోనే మొట్టమొదటిసారి ఇండియాలోనే పండించారట. అనంతరం ఇతర దేశాలకు వ్యాప్తించింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 78 శాతం వరకు కీరదోసను పండిస్తున్నారు.
నీటిశాతం అధికం..
కీరదోసలో నీటిశాతం అధికంగా ఉంటుంది. దీనిని తినడంవల్ల బాడీ డీ హైడ్రేషన్‌కు గురికాకుండా ఉంటుంది. శరీరంలోని జీవక్రియలు సక్రమంగా జరగడానికి దోహద పడుతుంది. ఇందులోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. మలబద్దకాన్ని నివారిస్తుంది. శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్లను కూడా బయటకు పంపిస్తుంది.
రోగ నిరోధక శక్తిని పెంచుతుంది
కీర దోస రోగ నిరోధక శక్తిని పెంచడం ద్వారా అధిక అలసటను, అనారోగ్యాలను దూరం చేస్తుంది. ఇందులో విటమిన్ కె కూడా పుష్కలంగా ఉంటుంది. ఎముకలు దృఢంగా ఉండేందుకు ఇది సహాయపడుతుంది. పొటాషియం, మెగ్నీషియం కలిగి ఉండటంవల్ల గుండెజబ్బులను నివారిస్తుంది. సమ్మర్‌లో కీరదోసతోపాటు కొంచెం పుదీనా వేసి జ్యూస్ చేసుకుని తాగితే సన్‌స్ర్టోక్, డీ హైడ్రేషన్ ప్రభావం ఉండదు. కీరదోసలోని పోషకాలు కంటి ఆరరోగ్యాన్ని, చర్మ సౌందర్యాన్ని పెంచడంలో సహాయపడతాయంటున్నారు నిపుణులు.






