- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Keeradosa: కీరదోసతో డీ హైడ్రేషన్ సమస్యకు చెక్!
సమ్మర్ వచ్చిందంటే చాలు.. కీరదోస తినడానికి ఇష్టపడని వారుండరు. ఎండ వేడివల్ల తలెత్తే సమస్యలకు దీనివల్ల ఉపశమనం కలుగుతుంది.

దిశ, ఫీచర్స్ : సమ్మర్ వచ్చిందంటే చాలు.. కీరదోస తినడానికి ఇష్టపడని వారుండరు. ఎండ వేడివల్ల తలెత్తే సమస్యలకు దీనివల్ల ఉపశమనం కలుగుతుంది. చాలామంది భోజన సమయంలో సలాడ్ రూపంలో దీనిని తీసుకుంటుంటారు. అనేక ఔషధ గుణాలు కలిగిన కీరదోసను పచ్చిగాను తింటారు. ఇలా తినడంవల్ల కూడా ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు లభిస్తాయి. మరో విషయం ఏంటంటే దీనిని ప్రపంచంలో మొట్టమొదటిసారి ఇండియాలోనే పండించారట. అనంతరం ఇతర దేశాలకు వ్యాప్తి చెందింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 78 శాతం వరకు కీరదోసను పండిస్తున్నారు.
వాటర్ పర్సెంటేజ్ ఫుల్
కీరదోసలో నీటిశాతం అధికంగా ఉంటుంది. దీనిని తినడంవల్ల బాడీ డీ హైడ్రేషన్‌కు గురికాకుండా ఉంటుంది. శరీరంలోని జీవక్రియలు సక్రమంగా జరగడానికి దోహద పడుతుంది. ఇందులోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. మలబద్దకాన్ని నివారిస్తుంది. శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్లను కూడా బయటకు పంపిస్తుంది.
విటమిన్ కె
ఇమ్యూనిటీ పవర్‌ను పెంచే కీరదోసలో విటమిన్ కె పుష్కలంగా ఉంటుంది. ఎముకలు దృఢంగా ఉండేందుకు ఇది సహాయపడుతుంది. పొటాషియం, మెగ్నీషియం కలిగి ఉండటంవల్ల గుండెజబ్బులను నివారిస్తుంది. సమ్మర్‌లో కీరదోసతోపాటు కొంచెం పుదీనా వేసి జ్యూస్ చేసుకుని తాగితే సన్ స్ర్టోక్, డీ హైడ్రేషన్ ప్రభావం ఉండదు. కీరాలో లారిసెరిసినాల్, పినోరేసినాల్, సెకోయు సోరిసినాల్ అనే లిగ్నన్స్ అండాశయ, గర్భాశయ, ప్రోస్ట్రేట్ క్యాన్సర్లను నివారిస్తాయి. కంటి ఆరరోగ్యాన్ని, చర్మ సౌందర్యాన్ని పెంచడంలో కీరదోస అద్భుతంగా పనిచేస్తుంది.






