మీ ఫోన్ బ్యాటరీ స్ట్రాంగ్‌గా ఉండాలా? ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అయిపోండి..

by Sujitha Rachapalli |

ఫోన్ లేకుండా జీవించడం చాలా కష్టం. ప్రస్తుతం ప్రతి ఫినాన్షియల్ టాస్క్‌లో భాగమైన స్మార్ట్ ఫోన్ లేకుండా బయటకు వెళ్లలేము కూడా. అయితే మనం చార్జింగ్ పెట్టేటప్పుడు చేసే కొన్ని మిస్టేక్స్ వల్ల బ్యాటరీ ఎఫెక్ట్ అవుతుంది

మీ ఫోన్ బ్యాటరీ స్ట్రాంగ్‌గా ఉండాలా? ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అయిపోండి..
X

దిశ, ఫీచర్స్ : ఫోన్ లేకుండా జీవించడం చాలా కష్టం. ప్రస్తుతం ప్రతి ఫినాన్షియల్ టాస్క్‌లో భాగమైన స్మార్ట్ ఫోన్ లేకుండా బయటకు వెళ్లలేము కూడా. అయితే మనం చార్జింగ్ పెట్టేటప్పుడు చేసే కొన్ని మిస్టేక్స్ వల్ల బ్యాటరీ ఎఫెక్ట్ అవుతుంది. దీనివల్ల కొన్నిసార్లు మొబైల్ కూడా డ్యామేజ్ అయ్యే పరిస్థితి తలెత్తుతుంది.అలాంటి జరగకుండా ఫోన్ బ్యాటరీ స్ట్రాంగ్‌గా ఉండేందుకు కొన్ని సూచనలు అందిస్తున్నారు నిపుణులు.

1. చాలా మంది మొబైల్ ఫోన్స్ బ్యాటరీ పూర్తిగా లో అయ్యాకే చార్జింగ్ పెడుతారు. కాస్త చార్జింగ్ కాగానే మళ్లీ యూజ్ చేస్తారు. ఈ అలవాటు మొబైల్ బ్యాటరీ లైఫ్‌ను తగ్గిస్తుంది. ఇలా కాకుండా అవసరమైతే రోజుకు రెండుసార్లు ఫోన్ చార్జింగ్ చేయడం బెస్ట్ ఆప్షన్.

2. అలాగని అనేకసార్లు ఓవర్ చార్జ్ చేయడం కూడా కరెక్ట్ కాదు. బ్యాటరీ లెవల్ దాదాపు 20%కి పడిపోయినప్పుడు మొబైల్‌ ఛార్జ్ చేయాలి. ఈ పాయింట్ కంటే తక్కువగా పడిపోవడం, మొబైల్ షట్ డౌన్ అయ్యేదాకా వాడటం మంచిది కాదు.

3. బ్యాటరీ 80%కి చేరుకున్న తర్వాత ఫోన్‌ను అన్‌ప్లగ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఈ లెవల్‌లో ఛార్జ్ ఉంచడం సరైన బ్యాటరీ లైఫ్‌ కొనసాగేలా చేస్తుంది. మరీ ముఖ్యంగా 45-75 ప్రాసెస్ ఫాలో కావడం బెస్ట్. అంటే బ్యాటరీ 45% కంటే తక్కువ పడిపోయినప్పుడు మొబైల్‌ను ఛార్జ్ చేయడం.. 75%కి చేరుకున్న తర్వాత డిస్‌కనెక్ట్ చేయడం.

Next Story