- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బట్టలు.. బాడీ.. భయం.. వింత వ్యాధితో భయపడుతున్న స్టార్ డైరెక్టర్
ఒకప్పుడు బాలీవు డ్‌ను ఏలిన స్టార్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్.. ప్రస్తుతం డైరెక్టర్‌గా కాకుండా నిర్మాతగానే ఎక్కువ సినిమాలు చేస్తున్నాడు. ఒకానొక సమయంలో సోషల్ మీడియాలో ఘోరమైన హేట్ చవిచూసిన ఆయన..

దిశ, ఫీచర్స్ : ఒకప్పుడు బాలీవుడ్‌ను ఏలిన స్టార్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్.. ప్రస్తుతం డైరెక్టర్‌గా కాకుండా నిర్మాతగానే ఎక్కువ సినిమాలు చేస్తున్నాడు. ఒకానొక సమయంలో సోషల్ మీడియాలో ఘోరమైన హేట్ చవిచూసిన ఆయన.. ఇప్పటికీ ఆ ఎఫెక్ట్‌తోనే ఉంటున్నాడు. కాగా ఈ మధ్య ఇంటర్వ్యూలో ఓ వింత వ్యాధితో బాధపడుతున్నట్లు చెప్పుకొచ్చాడు. బాడీ డిస్మోర్ఫియాతో తను చేస్తున్న అంతర్గత పోరాటాన్ని వెల్లడించారు. కాగా ఈ మెంటల్ డిజార్డర్‌తో ఉన్న వ్యక్తి తమ రూపంలోని లోపాల గురించి ఎక్కువగా ఆలోచిస్తాడు. బాధపడుతూనే ఉంటాడు. ఈ లోపాలు ఇతరులకు కనిపించవు.. ఒకవేళ కనిపించినా చాలా చిన్నవిగా అనిపించొచ్చు కానీ.. రోగుల రోజువారీ పనితీరును ప్రభావితం చేసే విధంగా ఉంటుంది.
ఇంతకీ కరణ్ తన వ్యాధి గురించి ఏం చెప్పుకొచ్చాడంటే.. “నాకు బాడీ డిస్మోర్ఫియా ఉంది. నేను పూల్ కి వెళ్ళినప్పుడు.. చాలా వింతగా అనిపిస్తుంది. చెడుగా అనిపించకుండా పూల్‌కి ఎలా వెళ్లాలో నాకు తెలియదు. ఈ ఆలోచనను అధిగమించడానికి చాలా ప్రయత్నించాను. కానీ అధిగమించలేకపోతున్నాను. అందుకే బరువు తగ్గాను కానీ దానిని ప్రజలకు చూపించడంలో చాలా ఇబ్బంది ఉంది. నా శరీరాన్ని ఎవరికీ చూపించకూడదనుకోవడానికి ఇదే కారణం. అందుకే నేను నాసైజు కంటే చాలా పెద్ద బట్టలు ధరిస్తాను. నా శరీరం బాగానే ఉందని నన్ను నేను ఒప్పించుకోలేకపోతున్నాను” అని జోహార్ అన్నారు.
వ్యాధి లక్షణాలు
బ్రిటిష్ హెల్త్ సర్వీస్ NHS ప్రకారం, బాడీ డిస్మోర్ఫియా ఉన్న వ్యక్తులు తమ శరీరంలోని ఒక నిర్దిష్ట భాగం గురించి ఆలోచిస్తూనే ఉంటారు. తమ రూపాన్ని ఇతరులతో పోల్చుకుంటారు. అద్దంలో తమను తాము ఎక్కువగా చెక్ చేసుకోవచ్చు. అధికంగా జుట్టు దువ్వడం, ముఖం కడుక్కోవడం, మేకప్ వేసుకోవడం, బట్టలు మార్చుకోవడం చేస్తుంటారు. అనేక చర్మ సంరక్షణ ఉత్పత్తులను ప్రయత్నించవచ్చు.
చికిత్స
అలాంటి భావాలను అనుభవిస్తున్న ఎవరైనా వైద్యుడిని సంప్రదించాలి. ఈ పరిస్థితికి ప్రభావవంతమైన చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ (CBT), ఒక సాధారణ విధానం. CBTలో ప్రతికూల ఆలోచనా విధానాలను, ప్రవర్తనలను అర్థం చేసుకోవడానికి, సెట్ చేయడానికి ప్రయత్నిస్తారు నిపుణులు. వ్యక్తి లక్షణాలను బట్టి యాంటిడిప్రెసెంట్ మందులను కూడా సూచించవచ్చు. చికిత్స ప్రాథమిక లక్ష్యం వ్యక్తులు తమ ప్రతికూల అవగాహనలను మార్చుకోవడంలో, మరింత పాజిటివ్ బాడీ ఇమేజ్‌ను పెంపొందించుకోవడంలో సహాయపడటం.






