- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్.. రెడ్ కార్పెట్‌పై నడిచిన తొలి ఐఏఎస్ అధికారి..
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో రెడ్ కార్పెట్‌పై నడిచిన మొదటి ఐఏఎస్ ఆఫీసర్‌గా రికార్డ్ సృష్టించాడు అభిషేక్ సింగ్. 2011 బ్యాచ్‌కు చెందిన ఆయన.. సివిల్ సర్వీసెస్ నుంచి ఎంటర్‌టైన్మేంట్ ఇండస్ట్రీకి మారాడు. బహుముఖ ప్రజ్ఞాశాలిగా నిరూపించుకున్నాడు. ఫెయిల్యూర్స్, క్రిటిక్స్‌ను యాక్సెప్ట్ చేస్తూనే తను

దిశ, ఫీచర్స్ : కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో రెడ్ కార్పెట్‌పై నడిచిన మొదటి ఐఏఎస్ ఆఫీసర్‌గా రికార్డ్ సృష్టించాడు అభిషేక్ సింగ్. 2011 బ్యాచ్‌కు చెందిన ఆయన.. సివిల్ సర్వీసెస్ నుంచి ఎంటర్‌టైన్మేంట్ ఇండస్ట్రీకి మారాడు. బహుముఖ ప్రజ్ఞాశాలిగా నిరూపించుకున్నాడు. ఫెయిల్యూర్స్, క్రిటిక్స్‌ను యాక్సెప్ట్ చేస్తూనే తను అనుకున్నది సాధించాడు. ఇంటర్నేషనల్ వేదికపై ప్రత్యేకతను చాటాడు. నటుడిగా తన సినిమాకు స్టాండింగ్ ఒవేషన్ అందుకున్నాడు. కాగా ఆయన జర్నీ గురించి తెలుసుకుందాం.
అమోఘమైన పరిపాలన నిర్ణయాలు
ఉత్తరప్రదేశ్ కేడర్‌కు చెందిన అభిషేక్, ఆగస్టు 22, 1983న జౌన్‌పూర్‌లో జన్మించాడు. మాజీ IPS అధికారి కృపా శంకర్ సింగ్ కుమారుడు అయిన ఆయన.. ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, సివిల్ సర్వీసెస్‌కు ప్రిపేర్ అయ్యాడు. 2011లో మొదటి ప్రయత్నంలోనే UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఆల్ ఇండియా 94 ర్యాంక్ (AIR) సాధించాడు. ఉత్తరప్రదేశ్ కేడర్‌కు నియమితుడై.. ఢిల్లీ డిప్యూటీ కమిషనర్‌గా, తర్వాత కమిషనర్‌గా కీలక బాధ్యతలు నిర్వహించాడు. తన పదవీకాలంలో ధైర్యమైన పరిపాలన నిర్ణయాలు, సామాజిక సేవా ప్రచారాలను చేపట్టి ప్రశంసలు అందుకున్న ఆయన.. NCR ప్రాంతంలో నైపుణ్యం లేని కార్మికుల నియామకాన్ని సులభతరం చేయడానికి SIGMA (స్టూడెంట్స్ ఫర్ ఇన్వాల్వ్డ్ గవర్నెన్స్ అండ్ మ్యూచువల్ యాక్షన్) అనే లాభాపేక్షలేని సంస్థను స్థాపించాడు.
వివాదాలు
UPSC పరీక్షలో లోకోమోటర్ డిసెబిలిటీ కేటగిరీ కింద అభిషేక్ ఎంపికపై విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా అతని డాన్స్, జిమ్ వీడియోలు వైరల్ అయిన తర్వాత అతని వైకల్యంపై సందేహాలు వ్యక్తమయ్యాయి. 2023 ఫిబ్రవరిలో.. 82 రోజులపాటు నోటీసు లేకుండా డ్యూటీకి గైర్హాజరైనందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అతన్ని సస్పెండ్ చేసింది. దీంతో 2023 మార్చిలో IAS నుంచి రాజీనామా చేసి.. నటన, ఇతర ఆసక్తులను కొనసాగించాడు. ఇందుకు తన భార్య అయిన ఐఏఎస్ అధికారి దుర్గాశక్తి నాగ్‌పాల్ ఫుల్ సపోర్ట్ అందించింది.
నటనా ప్రవేశం
కాస్టింగ్ డైరెక్టర్ ముకేష్ ఛబ్రాతో పరిచయం ద్వారా అభిషేక్ నటనలోకి ప్రవేశించాడు. 2019లో చార్ పంద్రహ్ అనే షార్ట్ ఫిల్మ్‌తో డెబ్యూ అయ్యాడు. ఇది ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ఉత్తమ సౌండ్ రికార్డింగ్ అవార్డును గెలుచుకుంది. ఆ తర్వాత నెట్‌ఫ్లిక్స్ సిరీస్ ఢిల్లీ క్రైమ్, బి ప్రాక్ దిల్ తోడ్ కే మ్యూజిక్ వీడియో, సన్నీ లియోన్‌తో థర్డ్ పార్టీ చిత్రంలో కూడా నటించిన అభిషేక్.. 78వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తన తొలి చిత్రం 1946: డైరెక్ట్ యాక్షన్ డే – ది ఎరేస్డ్ హిస్టరీ ఆఫ్ బెంగాల్‌తో పాల్గొన్నారు. విజయ్ యెలకంటి దర్శకత్వం వహించిన ఈ సినిమా.. భారత విభజనకు ముందు 1946లో బెంగాల్‌లో రాజకీయ, సామాజిక అలజడిని చిత్రించింది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శితమై.. స్టాండింగ్ ఒవేషన్ అందుకుంది. ఫిల్మ్ క్రిటిక్స్ దీనిని రాజకీయంగా ధైర్యవంతమైన చిత్రంగా ప్రశంసించారు. ఇక తన తొలి సినిమా ప్రదర్శన సందర్భంగా.. అభిషేక్ రెడ్ కార్పెట్‌పై నడవడంతో IAS అధికారిగా ఈ ఘనత సాధించిన మొదటి వ్యక్తిగా రికార్డ్ క్రియేట్ చేశాడు.
అభిషేక్ భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడంపై గర్వంగా ఉందంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. నటుడిగా, సినిమాటోగ్రాఫర్‌గా మాత్రమే కాకుండా.. దేశానికి సేవ చేసిన వ్యక్తిగా భారతదేశాన్ని ప్రాతినిధ్యం వహించడం గౌరవంగా ఉందన్నాడు. ఐఏఎస్ ఆఫీసర్‌గా రాజీనామా తర్వాత అభిషేక్ రాజకీయాల్లోకి ప్రవేశించాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. జౌన్‌పూర్ నుంచి BJP తరపున ఎన్నికల్లో పోటీ చేయవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు తను అనుకున్నది సాధించి.. సక్సెస్ అయిన అభిషేక్.. భవిష్యత్తులోనూ అంతే స్పీడ్‌తో దూసుకుపోవాలని కోరుకుంటున్నారు అభిమానులు.






