- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
AC helmets : మండే ఎండలోనూ కూల్.. కూల్..! ట్రాఫిక్ పోలీసుల కోసం ఏసీ హెల్మెట్లు ఇవిగో..!
AC helmets : మండే ఎండలోనూ కూల్.. కూల్..! ట్రాఫిక్ పోలీసుల కోసం ఏసీ హెల్మెట్లు ఇవిగో..!

దిశ, ఫీచర్స్ : అసలే ఎండలు మండుతున్నాయ్.. పగలు అధిక ఉష్ణోగ్రతలతో, రాత్రి ఉక్కబోతలతో జనం అవస్థలు పడుతున్నారు. ఇప్పుడే ఇంత వేడిగా ఉందంటే.. బాబోయ్ మేలో ఇంకెట్లుంటుందో కదూ! మరి నిత్యం ఎండలో నిలబడి రోడ్లపై విధులు నిర్వహించే ట్రాఫిక్ పోలీసుల పరిస్థితి ఇంకెంత ఘోరంగా ఉంటుందో! తల్చుకుంటేనే జడుసుకుంటారు ఎవరైనా.. ఈ సందర్భంగా వారు వడదెబ్బకు, అనారోగ్యాలకు గురయ్యే రిస్క్ ఎక్కువ. అయితే ఈ సమస్యకు చెక్ పెట్టేలా ప్రస్తుతం ట్రాఫిక్ పోలీసుల (Traffic Police) కోసం ప్రత్యేక ‘ఏసీ హెల్మెట్లు’ అందుబాటులోకి వచ్చాయి.
ఎక్కడైనా సమస్య ఉందంటే.. దానికి పరిష్కారం కూడా ఎక్కడో ఒక దగ్గర, ఎప్పుడో ఒకప్పుడు లభిస్తుంది అంటారు నిపుణులు. ప్రస్తుతం ట్రాఫిక్ పోలీసుల విషయంలోనూ అదే రుజువైంది. మండే ఎండలో సైతం.. మిట్ట మధ్యాహ్నం వేళలో కూడా నడి రోడ్డుపై నిల్చుని విధులు నిర్వహిస్తుంటారు ట్రాఫిక్ పోలీసులు. అయితే ఎండ నుంచి ఉపశమనం కలిగించేలా వీరికోసం ప్రస్తుతం ప్రత్యేకంగా ఏసీ హెల్మెట్లు (AC Helmets) అందుబాటులోకి వచ్చాయి. వీటినే కూలింగ్ హెల్మెట్స్ (Cooling helmets), పోర్టబుల్ ఏసీ హెల్మెట్స్ (Portable AC Helmets) అని కూడా పిలుస్తారు. కాగా ప్రత్యేకించి ట్రాఫిక్ పోలీసులను దృష్టిలో ఉంచుకునే వీటిని తయారు చేసిందట జర్స సేఫ్టీ (Jarsh Safety) అనే సంస్థ. ఇటీవల వీటిని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు సైతం వీటిని సరఫరా చేసినట్లు తెలుస్తోంది.
ఏసీ హెల్మెట్ల(AC Helmets)ను గుజరాత్‌లోని ట్రాఫిక్ పోలీసులు సైతం ఉపయోగిస్తుండగా.. వాటిని వి. టెలిబైట్ (V Telebyte) సంస్థ డెవలప్ చేసింది. కాగా భారత దేశంలోని వివిధ పోలీసు విభాగాలకు జర్స అండ్ వి. టెలిబైట్ సంస్థలు పోర్టబుల్ ఏసీ హెల్మెట్ల(Portable AC helmets) ను అందిస్తున్నాయి. వీటిని ధరించి నిర్వహించడం వల్ల ట్రాఫిక్ పోలీసులకు ఎండ నుంచి ఉపశమనం కలుగుతుంది. వడదెబ్బ తగలకుండా ఉంటుంది. ప్రస్తుతం హైదరాబాద్, వడోదరా, లక్నో (Hyderabad, Vadodara, Lucknow) వంటి నగరాల్లోని ట్రాఫిక్ పోలీసులు వీటిని ఉపయోగిస్తున్నారు.






