‘నిజమే.. వారికి జైలు జీవితమే మంచి ఆప్షన్’.. అసలు విషయం తెలిస్తే గుండె తరుక్కుపోవడం ఖాయం

by Sujitha Rachapalli |   (  Updated:2025-02-03 12:06:42  IST  )

ఓ 81ఏళ్ల జపాన్‌కు చెందిన ముసలవ్వ పదే పదే కావాలనే దొంగతనాలు చేస్తుండటంతో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అసలు ఎందుకు ఇలా చేస్తున్నావని అడిగితే..

‘నిజమే.. వారికి జైలు జీవితమే మంచి ఆప్షన్’.. అసలు విషయం తెలిస్తే గుండె తరుక్కుపోవడం ఖాయం
X

దిశ, ఫీచర్స్ : ఓ 81ఏళ్ల జపాన్‌కు చెందిన ముసలవ్వ పదే పదే కావాలనే దొంగతనాలు చేస్తుండటంతో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అసలు ఎందుకు ఇలా చేస్తున్నావని అడిగితే.. ‘‘నాకు వయస్సు మీద పడ్డాక కొడుకుకు భారమైపోయాను. నన్ను ఇంటికి దూరంగా ఓ గదిలో బంధించి ఉంచేస్తున్నాడు. ఒంటరిగా బతకలేకపోతున్నా. చోరీ చేస్తే జైలుకు పోవచ్చు. నలుగురితో మాట్లాడొచ్చు’’ అని సమాధానమిచ్చింది. అరవై ఏళ్ల నుంచే ఇలా దొంగతనం చేస్తున్న తాను జైలు నుంచి రిలీజ్ అయినా తన కొడుకు దగ్గరికి పోవాలంటే భయమేస్తుందని చెప్పింది. చేతనైతే ఏదైనా పనిచేసుకునే దాన్ని కానీ బలహీనంగా ఉన్నా కాబట్టి ఇలా చేయాల్సి వస్తుందని బాధపడింది. ఈ స్టోరీని చైనా మీడియా వైరల్ చేయగా.. జపాన్ నేషన్ ఇష్యూ బయట పడింది. ఒంటరితనంతో మరణించలేక.. చాలా మంది వృద్ధులు జైలులో ఉండేందుకు మొగ్గుచూపుతున్నారని తేలింది.

ఇక ఈ విషయంపై మాట్లాడిన అక్కడి జైలు అధికారులు.. వృద్ధులు ఒంటరిగా చనిపోయే బదులు జైలును ప్రిఫర్ చేస్తున్నారని తెలిపారు. 2003 నుంచి ఈ సంఖ్య నాలుగు రెట్లు పెరిగినట్లు చెప్పారు. జైలులో పని చేస్తే ఖైదీలకు 20వేల నుంచి 30వేల రూపాయలు చెల్లించబడుతాయని.. వారికి ఫినాన్షియల్ సపోర్ట్, ఫుడ్, స్టేబుల్ లివింగ్ కూడా ఉంటుందని, అందుకే ఇలా చేస్తున్నారని వివరించారు. ఇక ఈ దేశంలో ఒంటరితనంతో వృద్ధులు చనిపోవడం చాలా సాధారణం. కాగా దీనికి Kodokushi అనే పదాన్ని వాడుతారు. అంటే లోన్లీ డెత్.

Next Story