- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Human washing machin : బట్టల్నే కాదు.. మనుషుల్ని ఉతికి ఆరబెట్టే వాషింగ్ మెషిన్ కూడా వచ్చేసిందోచ్..!
మిరాయ్ నింగెన్ సెంటాకుకి అనే ఏఐ ఆధారిత హ్యూమన్ వాషింగ్ పాడ్ కేవలం 15 నిమిషాల్లో మనిషి శరీరాన్ని శుభ్ర పరిచి ఆరబెట్టగలదు.

దిశ, ఫీచర్స్ : ఇన్ని రోజులు బట్టలు ఉతకడానికే వాషింగ్‌మెషిన్లు అందుబాటులో ఉన్నాయి. కానీ ఇక ముందు ‘మనుషుల్ని ఉతికి ఆరబెట్టే’ వాషింగ్ పాడ్స్ కూడా అందుబాటులోకి రావచ్చు..! ఎందుకంటే తాజాగా జపాన్‌లోని సైన్స్ కో. అనే సంస్థ ఒసాకా కాన్సాయ్ ఎక్స్‌పో -2025లో ప్రదర్శించే ఉద్దేశంతో మిరాయ్ నింగెన్ సెంటాకుకి (Mirai Ningen Sentakuki) అనే ఏఐ ఆధారిత హ్యూమన్ వాషింగ్ పాడ్(Human washing machin)ను ఇప్పటికే అభివృద్ధి చేసింది. ఈ వినూత్న పరికరం(device) కేవలం 15 నిమిషాల్లో మనిషి శరీరాన్ని శుభ్ర పరిచి ఆరబెట్టగలదు.
తాజాగా డెవలప్ చేసిన హ్యూమన్ వాషింగ్‌పాడ్ చూడటానికి ఫైటర్ జెట్ కాక్‌పిట్(Fighter jet cockpit)ను తలపించే అందమైన, సొగసైన డిజైన్(elegant design)ను కలిగి ఉంది. దీని వినియోగదారులు తరచుగా బట్టలు మార్చడం, స్నానం చేయడం వంటివి చేయకున్నా పర్లేదు. జస్ట్ ఆ మెషిన్(Mirai Ningen Sentakuki)లోని సీటులో కూర్చుంటే చాలు. దానంతట అదే మనిషి శరీరాన్ని విశ్లేషించి, అర్థం చేసుకొని అవసరమైన నీటిని రిలీజ్ చేసి, హై స్పీడ్ జెట్స్ ద్వారా మైక్రో స్కోపిక్ గాలి బుడగల(microscopic air bubbles)ను విడుదల చేస్తుంది. ఇవి చర్మంపైన పగిలి మలినాలను సమర్థవంతంగా తొలగిస్తాయి.
ఎంతైనా యంత్రం కదా.. హ్యూమన్ వాషింగ్ పాడ్ (Human washing machin) వల్ల ఏదైనా హాని జరిగితే..? అనే సందేహం ఎవరికైనా కలగొచ్చు. కానీ అలాంటి అవకాశం ఉండదంటున్నారు నిపుణులు. ఎందుకంటే అందులోని సెన్సార్లు మనిషి హార్ట్‌బీట్, బాడీ టెంపరేచర్ డేటాను ఎప్పటికప్పుడు వేగంగా సేకరిస్తూ, నీటి ఉష్ణోగ్రతను వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా సర్దుబాటు చేస్తాయి. అంతేకాకుండా అందులోని ఏఐ(AI) సిస్టమ్ దాని యూజర్ భావోద్వేగ స్థితిని విశ్లేషించి, ఒత్తిడిని తగ్గించేందుకు పరికరంలోని డిస్‌ప్లేలో ప్రశాంతతను కలిగించే పీస్‌ఫుల్ వీడియోలను సైతం ప్రదర్శిస్తుంది. అయితే ఈ ఆలోచన 1970లో సాన్యో ఎలక్ట్రిక్ (Sanyo Electric) ద్వారా ప్రవేశపెట్టిన అల్ట్రాసోనిక్ బాత్ నుండి స్ఫూర్తి పొందింది. కానీ ఆధునిక AI సాంకేతికతతో ఇది మరింత అభివృద్ధి చెందింది.
హ్యూమన్ వాషింగ్ పాడ్‌ను అందరూ ఉపయోగించడం వ్యక్తిగత ఇష్టాయిష్టాలే అయినప్పటికీ, వృద్ధులు, నడవలేని స్థితిలో ఉన్నవారికి మాత్రం ఇది సురక్షితమైన, సౌకర్యవంతమైన బాతింగ్ అనుభవాన్ని (bathing experience) అందిస్తుంది. అయితే డేటా ప్రైవసీ, ఖర్చు వంటి సవాళ్లను అధిగమించి ఇది మార్కెట్లోకి రావాల్సి ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. అదే జరిగితే ఇక బట్టలను ఉతికి ఆరబెట్టినట్లే, దుస్తులు తీయకుండానే మనుషులు తమ శరీరాన్ని శుభ్రపర్చుకొని ఆరబెట్టుకోవచ్చు! Source link






