Viral Video: జాన్వీ కపూర్ ర్యాంప్‌పై నడుస్తుంటే..వెనుక ఉన్న మోడల్ నీ అందరూ ఎందుకు చూశారు?

by Vennela |

Janhvi Kapoor's ramp walk: లాక్మే ఫ్యాషన్ వీక్ 2025లో బాలీవుడ్ హీరోయిన్ జాన్వీకపూర్ తన గ్లామర్ వాక్ తో ఆకట్టుకుంది.

Viral Video: జాన్వీ కపూర్ ర్యాంప్‌పై నడుస్తుంటే..వెనుక ఉన్న మోడల్ నీ అందరూ ఎందుకు చూశారు?
X

దిశ, వెబ్ డెస్క్: Janhvi Kapoor's ramp walk: లాక్మే ఫ్యాషన్ వీక్ 2025లో బాలీవుడ్ హీరోయిన్ జాన్వీకపూర్ తన గ్లామర్ వాక్ తో ఆకట్టుకుంది. ప్రముఖ ఇండియన్ ఫ్యాషన్ డిజైనర్ రాహుల్ మిశ్రాకు నటి జాన్వీ షోస్టాపర్ గా నిలిచింది. జాన్వీ కపూర్ బ్లాక్ కలర్ దుస్తుల్లో ర్యాంప్ పై నడిచింది. పొడవాటి నల్లటి కోటు ధరించి అద్బుతమైన బంధానీ బాడీకాన్ డ్రెస్సులో స్టేజీపై ఆమె అడుగుపెట్టింది. ఈ క్రమంలో ఆమె హీల్స్ కూడా ఎంచుకుంది. స్టేజీపై మధ్యలో జాన్వీ తన కోటు తీసేసి స్టేజీపై ఫోజులిచ్చింది. కొంత దూరం అలా తన ర్యాంప్ వాక్ ను కొనసాగించింది. డ్రెస్ డిజైనర్ బ్రాండ్ కోసం జాన్వీ భాగం అయ్యింది. భవిష్యత్తులో మరిన్ని కొత్త డిజైన్ డ్రెస్సులతో ఆమె ఫోజులు ఇవ్వనుంది. జాన్వీ ర్యాంప్ వాక్ కు సంబంధించి సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లలో అనేక వీడియోలు, ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

అయితే జాన్వీ ర్యాంప్ వాక్ పై యూజర్లు కామెంట్స్ చేస్తున్నారు. అక్కడి వారి కన్ను జాన్వీ వెనకున్న అమ్మాయిపై పడింది. జాన్వీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను..కానీ నీ కంటే నీ వెనకున్న అమ్మాయి నీకంటే బాగుందని కామెంట్ చేశారు. ఆమె వెనుకున్న మోడల్ అందమైన నడకను చూడండి అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు. హీరోయిన్స్ మోడల్స్ గా ఎందుకు పనిచేస్తున్నారు. ఆ క్రెడిట్ మోడల్స్ కు దక్కనివ్వండి. వాళ్లను వాళ్ల పని చేసుకోనివ్వండి. ఆమెకు నటన, మోడలింగ్ రెండూ తెలియదు..ఆమె తన ముక్కుతో మాట్లాడుతుంది అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశారు. ఇంకొంతమంది జాన్వీ వెనక నడిచే మోడల్ తెగ పొగిడేస్తున్నారు. వావ్ ఎంత అందంగా ఉంది. నాకు జాన్వీ కనిపించడం లేదు..వెనకున్న అమ్మాయే కనిపిస్తుంది అంటూ కామెంట్స్ చేశారు. ఇప్పుడా వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది.


Next Story