- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ది కైండ్‌నెస్ మీల్.. వంటకాలతో అన్ని తరాలను కలుపుతోంది.!
కొత్త జీవం పోస్తోంది

దిశ, ఫీచర్స్: జైపూర్‌కు చెందిన దీపాలీ ఖండేల్వాల్ "ది కైండ్‌నెస్ మీల్" ద్వారా మరచిపోయిన వంటకాలను రికార్డ్ చేసి తరాల మధ్య ఆహార సంప్రదాయాలను అనుసంధానిస్తూ వాటికి కొత్త జీవం పోస్తోంది.
ది కైండ్‌నెస్ మీల్
శతాబ్దాల నాటి రాజస్థానీ రెసిపీలు సాంస్కృతిక వారసత్వానికి నిదర్శనం. జైపూర్‌కు చెందిన దీపాలీ ఖండేల్వాల్ స్థాపించిన "ది కైండ్‌నెస్ మీల్" ఈ మరచిపోయిన వంటకాలకు పునరుజ్జీవనం పోస్తోంది. దీపాలీ ఉమ్మడి కుటుంబంలో పెరిగింది. అక్కడ ఆహారం కేంద్ర బిందువుగా ఉండేది. వాళ్ల తాత ప్రతి వంటకం నాణ్యతపై శ్రద్ధ చూపిస్తుండె. ఈ ఆహార సంస్కృతి దీపాలీ బాల్యంపై గాఢమైన ప్రభావం చూపింది. సూరత్‌కు చెంది మంజుతో పెద్దల నుండి నేర్చుకున్న రెసిపీలను తెలుసుకనేది. తన పరిశోధనలో మంజు దీపాలీకి స్ఫూర్తిగా నిలిచింది.
మార్పు కోసం అడుగు
ఏడేళ్లుగా దీపాలీ కళలు, సాంస్కృతిక ఉత్సవాల క్యూరేషన్ రంగంలో పనిచేస్తోంది. నగరాల్లో ప్యాకేజ్డ్, ప్రాసెస్డ్ ఆహారాల సౌలభ్యం పెరుగుతుండగా గ్రామీణ ప్రాంతాల్లో సాంప్రదాయ వంటకాలు కనుమరుగవుతున్నాయని ఆమె తెలుసుకుంది. సాంస్కృతిక ఔన్నత్య భావన కారణంగా గ్రామీణ.. గిరిజన ప్రజలు సాంప్రదాయ వంటకాలను పంచుకోవడానికి సంకోచిస్తున్నారు. నగర ఆహార ప్రాధాన్యతలకు అనుగుణంగా ఉండాలనే ఒత్తిడి పెరుగుతోంది. క్రమంగా స్థానిక ఆహార సంపదను కోల్పోయే ప్రమాదం ఉందని గుర్తించిన దీపాలి మార్పు తీసుకురావాలనుకుంది.
సాంస్కృతిక ప్రాముఖ్యత
దీపాలీ తన మూలాలను అర్థం చేసుకోవడానికి ప్రారంభించిన ఈ ప్రయాణం రాజస్థాన్ గ్రామీణ ప్రాంతాలను అన్వేషించడానికి దారితీసింది. స్థానిక ఆహార అలవాట్లు, స్వదేశీ పదార్థాలు, వాటి సీజనల్ లభ్యత, నిల్వ సాంకేతికతలు, విభిన్న రెసిపీలను జాగ్రత్తగా రికార్డ్ చేసింది. రాజస్థాన్‌ను భౌగోళికం, వ్యవసాయ లక్షణాలు, భాష ఆధారంగా తొమ్మిది సాంస్కృతిక మండలాలుగా విభజించింది. తన క్యూరేటెడ్ డైనింగ్ అనుభవాలు.. పాప్-అప్ ఈవెంట్‌ల ద్వారా తక్కువగా గుర్తింపు పొందిన రాజస్థానీ వంటకాలను విస్తృతంగా పరిచయం చేస్తూ వాటి సాంస్కృతిక ప్రాముఖ్యతను వివరిస్తోంది.
ఫుడ్ కల్చర్ ప్లే డేట్స్
"ది కైండ్‌నెస్ మీల్" ప్రధాన సూత్రం తరాల మధ్య పంచుకోవడం. పెద్దవారు తమ ఆహార జ్ఞానాన్ని, రెసిపీలను యువతకు అందించడమే దీని లక్ష్యం. కుటుంబ నిర్మాణాలు, జీవనశైలి మార్పుల కారణంగా సాంప్రదాయ రెసిపీలు కోల్పోతున్న ఈ సమయంలో ఇది చాలా కీలకం. దీనికోసం దీపాలీ 7 నుంచి 14 సంవత్సరాల పిల్లల కోసం "ఫుడ్ కల్చర్ ప్లే డేట్స్" నిర్వహిస్తోంది. పిల్లలు కుటుంబ సభ్యులతో వారి చిన్నతనంలో తిన్న ఆహారాలు, ఆ కథల గురించి మాట్లాడేలా అవగాహన కల్పిస్తోంది. ఆహారం కేవలం జీవనాధారం కాదు. అదొక గుర్తింపు అనేది తెలుుకోవాలంటోంది దీపాలీ ఖండేల్వాల్.






