- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Microplastics : ప్లాస్టిక్ భూతం..! ధమనుల్లో పేరుకుపోతున్న సూక్ష్మ కణాలు!
Microplastics : ప్లాస్టిక్ భూతం..! ధమనుల్లో పేరుకుపోతున్న సూక్ష్మ కణాలు!

దిశ, ఫీచర్స్ : ప్లాస్టిక్ వాడకం పర్యావరణానికే కాదు, మన ప్రాణాలకూ ప్రమాదకరమనే విషయం తెలిసిందే.. ప్రపంచ వ్యాప్తంగా ఇదొక ఆరోగ్య సమస్యగా పరిణమిస్తోందని చాలా కాలంగా వింటున్నాం. బాటిల్ వాటర్ నీళ్లలోనూ నానో ప్లాస్టిక్స్ ఉంటున్నాయని గత పరిశోధనలు హెచ్చరించారు. తరచుగా ప్లాస్టిక్ ఎక్స్‌పోజర్‌కు గురికావడంవల్ల మానసిక రుగ్మతలు, నరాల బలహీనత, క్యాన్సర్లు వంటివి తలెత్తుతాయని గత నివేదికలు కూడా పేర్కొన్నాయి. అయితే ఇటీవలి ఓ అధ్యయనం మరో ఆసక్తికరమైన విషయం వెల్లడించింది. మైక్రో ప్లాస్టిక్స్ ధమనుల్లోనూ పేరుకుపోతున్నాయని నిపుణులు గుర్తించారు. గుండె జబ్బులు కలిగిన పేషెంట్ల ఆర్టెరీస్ (ధమనులు)లో మైక్రో లేదా నానో ప్లాస్టిక్స్ ఉంటున్నాయని కనుగొన్నారు. కొన్నిసార్లు ఈ పరిస్థితి సడెన్ హార్ట్ ఎటాక్ రావడానికి దారితీస్తుందని కూడా ఇటలీకి చెందిన పరిశోధకుల అధ్యయనం పేర్కొన్నది.
*వాస్తవానికి ధమనులు అనేవి గుండె నుంచి శరీరానికి, శరీరం నుంచి గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ముఖ్యమైన రక్త నాళాలు. అయితే గుండె జబ్బుల బారిన పడినవారిలో దాదాపు సగానికంటే ఎక్కువమంది ధమనుల్లో మైక్రోప్లాస్టిక్స్ ఒక ఫలకంగా ఏర్పడుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. అధ్యయనంలో భాగంగా ఆర్టెరీ డిసీజెస్, హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ కలిగిన పేషెంట్లపై దృష్టి కేంద్రీకరించారు. సర్జరీల సమయంలో వారి అవయవాలను ఎనలైజ్ చేశారు. ఈ సందర్భంగా వారు ప్రత్యేకంగా మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే కరోటిడ్ ధమనిలో మైక్రోప్లాస్టిక్స్ ఉంటున్నట్లు కనుగొన్నారు. వీటి విశ్లేషణ కోసం వారు పైరోలిసిస్ - గ్యాస్, క్రోమాటోగ్రఫీ-మాస్ స్పెక్ట్రోమెట్రీ, స్థిరమైన ఐసోటోప్ ఎనలైజింగ్, ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ వంటి అధునాతన పద్ధతులను ఉపయోగించారు.
*హార్ట్ సర్జన్లు కూడా అయినటువంటి ఇటలీ పరిశోధకులు గుండె జబ్బుల రోగుల్లో శస్త్ర చికిత్సల సందర్భంగా ప్రతి 10 మంది రోగులలో ఆరుగురికి వారి ధమనులలో ప్లాస్టిక్ కణాలు కలిగి ఉన్నట్లు గుర్తించారు. ప్రత్యేకంగా పాలిథిలిన్, షాపింగ్ బ్యాగ్స్ అండ్ ప్యాకేజింగ్ మెటీరియల్స్‌ను తయారు చేసే పదార్థాలు 58.4 శాతం మంది రోగుల ఆర్టెరీస్‌లో పెక్కులు లేదా ఫలకం రూపంలో పేరుకుపోయి ఉండటాన్ని కనుగొన్నారు. పైపుల నుంచి వినైల్ రికార్డుల వరకు అన్నింటిలోనూ ఉపయోగించే పాలీ వినైల్ క్లోరైడ్ ఇందులో 12.1 శాతం వరకు ఉందని కూడా తెలిపారు. అయితే అవి మానువులపై ఎలాంటి ప్రభావం చూపుతాయో కూడా పరిశోధకులు అబ్జర్వ్ చేశారు. ఈ సందర్భంగా వారు దాదాపు 34 నెలల సగటు వ్యవధిలో 257 మంది రోగుల ఆరోగ్య ఫలితాలను విశ్లేషించారు. మైక్రోప్లాస్టిక్స్ గుండెపోటు, స్ట్రోక్ లేదా మరణం వంటి తీవ్రమైన హృదయ సంబంధ సంఘటనల ప్రమాదాన్ని పెంచుతాయని వెల్లడించారు.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ బాధ్యత వహించదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.






