Lifestyle: మధ్యాహ్నం నిద్రపోవడం మంచిదేనా .. చాణుక్యుడు ఏం చెప్పాడంటే..?

by Phanindra |

మనలో చాలా మంది మధ్యాహ్న భోజనం తర్వాత కొంత సేపు అయిన నిద్రిస్తారు.

Lifestyle: మధ్యాహ్నం నిద్రపోవడం మంచిదేనా .. చాణుక్యుడు ఏం చెప్పాడంటే..?
X

దిశ, వెబ్ డెస్క్ : మనలో చాలా మంది మధ్యాహ్న భోజనం తర్వాత కొంత సేపు అయిన నిద్రిస్తారు. అసలు ఇది మంచి పద్ధతేనా ? కాదా అని చాలా మందికి సందేహం ఉంది. నేటి జీవన విధానంలో నిద్రించడానికి సరైన సమయం దొరకడం లేదు. సమయం, సందర్భం లేకుండా పడుకోవడం వలన సంపద, ఆరోగ్యం పై ప్రభావం చూపుతుందని కొందరి వాదన. అయితే, చాణుక్యుడు దీనికి ఎలాంటి సమాధానం చెప్పాడో ఇక్కడ తెలుసుకుందాం..

మనిషి జీవితంలో నిద్ర చాలా ముఖ్యం. కనీసం రోజుకు 7 గంటల నిద్ర అవసరం. చాణుక్యుడు మధ్యాహ్న నిద్ర గురించి స్పష్టమైన విషయాలను తెలిపాడు. పగటి పూట నిద్రపోయేవారు త్వరగా మరణిస్తారని చెబుతున్నాడు. ఎందుకంటే, ఆ సమయంలో మనిషి అధిక శ్వాసను తీసుకుంటాడు. అందువలన ఆ సమయంలో నిద్రించకూడదు. అలాగే, వారి సక్సెస్ రేటు తగ్గుతుంది. పని మీద ఏకాగ్రత ఉండదని చాణుక్యుడు చెప్పాడు. అంతే కాదు, వీరికి ఏ పని చెప్పిన వెంటనే మర్చిపోతారు.

చాణుక్యుడు (chanakyudu ) మాత్రమే కాదు, డాక్టర్స్ ( Doctors) కూడా మధ్యాహ్న నిద్ర మంచిది కాదని చెబుతున్నారు. ఇలా నిద్రించే వాళ్ళకు అనేక అనారోగ్య సమస్యలు ( Health Problems) వస్తాయని అంటున్నారు. కాబట్టి, 15 నుంచి 30 నిముషాలు మాత్రమే రెస్ట్ తీసుకోవాలి. ప్రతి రోజూ పగటి పూట 2 గంటల పాటు నిద్రిస్తే ఆరోగ్యం పై ప్రభావం చూపుతుంది. దీని వలన గుండె కొట్టుకోవడంలో మార్పులు వచ్చి గుండె పోటు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. దీని మీద పరిశోధనలు చేసిన నిపుణులు కూడా మధ్యాహ్నం నిద్రపోయే వారు అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారని తెలిపారు. కాబట్టి, సాధ్యమైనంత వరకు రాత్రి పూట మాత్రమే నిద్రించడండి.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.

Next Story