cabbage: పచ్చి క్యాబేజీ తింటే ఏమవుతుంది.. తలెత్తే సమస్యలు ఏంటి?

by Kodari Anjali |

క్యాబేజీలో మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం ఎక్కువగా ఉండడం వల్ల బోన్స్ స్ట్రాంగ్‌గా మారుతాయి.

cabbage: పచ్చి క్యాబేజీ తింటే ఏమవుతుంది.. తలెత్తే సమస్యలు ఏంటి?
X

దిశ, వెబ్‌డెస్క్: క్యాబేజీలో మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం ఎక్కువగా ఉండడం వల్ల బోన్స్ స్ట్రాంగ్‌గా మారుతాయి. క్యాబేజీలో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకాన్ని నివారించడమే కాకుండా.. గుండె సమస్యలతో బాధపడేవారికి ఎంతో మేలు చేస్తుంది. క్యాబేజీలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ వంటి పోషకాలు మలబద్ధకాన్ని తరిమికొడుతాయి. క్యాన్సర్ నిరోధక లక్షణాలను కలిగి ఉంటుంది. రక్తపోటును నియంత్రించడంలో క్యాబేజీ మేలు చేస్తుంది.

క్యాబేజీలో సల్ఫోరాఫేన్, కెంప్ఫెరోల్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. కాగా ఇవి పలు రకాల క్యాన్సర్ల నుండి రక్షిస్తాయి. క్యాబేజీలో పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. దీనిలో ఉండే కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఎముకలను బలంగా చేస్తాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు శరీర నొప్పులను తగ్గించడంలో తోడ్పడతాయి.

క్యాబేజీలో కేలరీలు తక్కువగా ఉండటం వల్ల వెయిట్ లాస్ అవ్వొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. క్యాబేజీలో విటమిన్ సి, విటమిన్ కె వంటి పోషకాలు చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తాయి.దీనిలోని విటమిన్ సి, విటమిన్ ఏ వంటి పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ముఖ్యంగా క్యాబేజీ రసం కడుపు పూతల నయం కావడానికి కూడా మేలు చేస్తాయని నిపుణులు తరచూ చెబుతూనే ఉంటారు.

అయితే పచ్చి క్యాబేజీ తింటే మేలు జరుగుతుందా? లేదా ప్రమాదమా? అని నిపుణులు తాజాగా వెల్లడించారు. పచ్చి క్యాబేజీ తింటే పొట్ట ఉబ్బరంగా అనిపిస్తుంది. గ్యాస్ రావడం వంటి సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు. పైగా సున్నితమైన జీర్ణవ్యవస్థ కలిగినవారు పచ్చి క్యాబేజీ తినకపోవడమే బెటర్ అని నిపుణులు సూచిస్తున్నారు. పచ్చి క్యాబేజీలో పలు రకాల ప్రోటీన్లు ఉంటాయి. కానీ అవి అందరికీ పడాలని లేదని.. కొందరికీ పడకపోవచ్చని నిపుణులు క్లారిటీ ఇచ్చారు.

గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన సం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.

Next Story