సీజన్‌తో సంబంధం లేకుండా చలిపెడుతోందా.?

by Daayi Srishailam |

సీజన్‌తో సంబంధం లేకుండా చలిపెడుతుంది

సీజన్‌తో సంబంధం లేకుండా చలిపెడుతోందా.?
X

దిశ, ఫీచర్స్

అబ్బా మస్తు చలిపెడుతోంది. నాకేనా.. మీగ్గూడా పెడుతుందా అని అంటుంటారు కొందరు. నిజమే ఇది. కొందరికి ఊకూకెనే చలిపెడుతుందట. వేడిగా.. ఉక్కపోతగా ఉన్నా కూడా వాళ్లు తరుచూ అబ్బా చలి అంటుంటారట. శరీరంలో రక్త ప్రసరణ సరిగా లేకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్తున్నారు నిపుణులు. రక్త ప్రసరణ సరిగా ఉంటేనే శరీరమంతా వేడి సమ స్థితిలో.. వెచ్చగా ఉంటుంది. ఒకవేళ రక్త ప్రసరణ సక్రమంగా లేకపోతే కాళ్లు.. చేతుల్లో రక్త ప్రసరణ సరిగా జరగకపోతే ఎప్పుడూ చలివేసిన ఫీలింగ్ కలుగుతుందంటున్నారు. గుండె జబ్బులు.. రేనాడ్స్ వ్యాధులుంటే రక్త ప్రసరణ సరిగా జరగదు. కదలకుండా ఎక్కువసేపు ఒకేచోట కూర్చుండటం వల్ల కూడా బ్లడ్ సర్కులేషన్ వేగం తగ్గిపోయి చలి చలిగా అనిపిస్తుందట. ఇంకా ఐరన్ లోపం వల్ల కూడా ఇలా జరుగుతుందంటున్నారు. ఎర్ర రక్తకణాల్లోని హిమోగ్లోబిన్లో ఉండే ఐరన్ శరీరంలోని కణాలకు ఆక్సీజన్‌ను సప్లయ్ చేస్తుంది. దానివల్ల శరీరంలోని జీవక్రియలు సరిగా జరిగి వెచ్చగా ఉంటుంది. థైరాయిడ్ గ్రంథి పనితీరు సక్రమంగా లేకపోయినా ఇలా సీజన్‌తో సంబంధం లేకుండా చలిపెడుతుందట. శరీరంలో తగినంత కొవ్వు లేకపోవడం.. డీహైడ్రేషన్.. నిద్రలేమి వంటి సమస్యలేవి ఉన్నా చలి తీవ్రత చంపుతుందని చెప్తున్నారు నిపుణులు. కాబట్టీ వేసవి వస్తున్నా భరించలేని చలి అనుభూతి కలిగితే వెంటనే వైద్యున్ని సంప్రదించండి.

Next Story