Anger: ఎక్కువగా కోపం వస్తోందా.. తగ్గించుకోండిలా..!

by Kanadam.Hamsa lekha |

మనుషులన్నాకా కోపం రావడం సహజమే. చాలాసార్లు అనేక విషయాలపై కోపం వస్తుంటుంది.

Anger: ఎక్కువగా కోపం వస్తోందా.. తగ్గించుకోండిలా..!
X

దిశ, ఫీచర్స్: మనుషులన్నాకా కోపం రావడం సహజమే. చాలాసార్లు అనేక విషయాలపై కోపం వస్తుంటుంది. దీనికి ఎన్నో కారణాలు ఉంటాయి. కోరుకున్నది జరకపోయినా, ఇష్టమైనది దొరక్కపోయినా, మాటకు మాట చెప్పినా, చెప్పిన మాట వినకపోయినా ఇలా అనేక సందర్భాలు మనిషి కోపానికి కారణమవుతాయి. అయితే, కోపం రావడానికి గల పరిస్థితులు గురించి కొంచెం ఆలోచిస్తే, కోపాన్ని అదుపులో పెట్టుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ రోజుల్లో యువత చిన్న చిన్న విషయాలకే కోపం తెచ్చుకుంటున్నారు. దీని వల్ల శారీరక, మానసికంగా ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపుతుంది. ఇలా జరగకుండా ఉండాలంటే కొన్ని టిప్స్ పాటిస్తే చాలు.

కొందరు కోపం వస్తే తమలో తామే బాధపడి, తమని తామే గాయపరుచుకుంటారు. అయితే, ఇలాంటి ప్రవర్తన వల్ల మానసికంగా ఒత్తిడికి లోనవుతారు. ఇది బంధువులు, కుంటుంబికులు, మిత్రులను దూరం చేసే అవకాశం ఉంటుంది. అందుకే కోపం వచ్చినప్పుడు దానికి గల కారణాలు ఆలోచించాలి. ఆకస్మిక కోపం కారణంగా కొన్నిసార్లు గుండెపోటు, అధిక రక్తపోటు వంటి తీవ్రమైన సంఘటనలకు దారితీస్తుంది. కోపం అనేది అకస్మాత్తుగా వచ్చినప్పుడు అడ్రినలిన్ వంటి ఒత్తిడి హార్మోన్లు విడుదల అవుతాయి. దీని కారణంగా రక్త నాళాలకు ఎఫెక్ట్ అయ్యి, రక్త ప్రసరణకు ఆటంకం ఏర్పడుతుంది.

ఇలా చేస్తే చాలు:

దీర్ఘ శ్వాస: కోపం వచ్చే సందర్భంలో దీర్ఘ శ్వాసను తీసుకున్నట్లైతే కండరాలు, నాడులను కంట్రోల్‌లో ఉంచుతుంది. దీని వల్ల కోపం కొంత తగ్గి, ఆ విషయం గురించి ఆలోచించేలా చేస్తుంది. ప్రతి రోజూ చిన్న పాటి వ్యాయమం, ధ్యానం వంటి చేయడం వల్ల కోపం అదుపులో ఉంటుంది. దీని వల్ల శరీరం రిలాక్స్ అవుతుంది. మైండ్ ఫ్రెష్‌గా ఉంటుంది.

విశ్రాంతి: కొన్ని సందర్భా్లో పని ఒత్తిడి కారణంగా చిరాకు, ఆందోళన వంటి సమస్యలు వస్తాయి. ఇవి కుటుంబ సభ్యులు లేదా స్నేహితులపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. అందుకే పనిఒత్తిడిని తగ్గించుకోవాలంటే తప్పనిసరిగా కొంత సమయం విశ్రాంతి తీసుకోవడం మంచిది.

లౌక్యం: కోపం కారణంగా నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటారు. క్షణాల్లో కోపం తెచ్చుకోవడం సుభమే.. కానీ, ఆ తరువాత బాధపడాల్సి వస్తుంది. కోపంలో ఏదైనా అనే ముందు ఆలోచించడం మంచిది. ఆవేశం కారణంగా ఆలోచనలు మారుతాయి. ఆ సమయంలో మీ మెదడుకు పదును పెట్టాలి. లౌక్యంగా కోపాన్ని కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇటువంటి చిన్న విషయానికి కోపం తెచ్చుకోవడం వల్ల ప్రయోజనం ఏముంది? అని ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి. అవతలి వ్యక్తుల్ని గాయపరిచే మాటలు మాట్లాడకూడదు.

సంగీతం: సంగీతం అనేది ఎప్పుడూ కూడా మనస్సును ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఎలాంటి సందర్భాల్లో అయినా సరే సంగీతం వినడం వల్ల మెదడును రిలాక్స్ చేస్తుంది. మనసును ఉల్లాసపరిచే సంగీతం ఎప్పుడూ కూడా కోపాన్ని కంట్రోల్‌ చేయడానకి తోడ్పడుతుంది.

తెలివితో: కోపం వచ్చినప్పుడు అరిస్తే ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఇది సమస్యను మరింత పెద్దది చేయడమే కాకుండా ఒత్తిడిని కలిగిస్తుంది. అందుకే కోపాన్ని అరుపులతో కాకుండా తెలివిగా ఉపయోగించాలి. స్నేహితులతో కానీ సన్నిహితులతో కానీ ఈ అంశంపై చర్చించడం వల్ల పరిష్కారం లభిస్తుంది.

ఇష్టమైన వారితో గడపడం: ప్రతీ చిన్న విషయాన్ని ఎక్కువగా కోపడుతున్నట్లైతే.. అలాంటి సందర్భాల్లో నెమ్మదిగా ఆలోచించాలి. కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా మీకు ఇష్టమైన వ్యక్తులతో కొంత సమయం గడిపినా.. లేదా మాట్లాడినా కోపం కంట్రోల్ అవుతుంది. సాధ్యమైతే నచ్చిన పాటకు డాన్స్ చేయాలి.

*గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు.

Next Story