IRCTC Tour package: సమ్మర్‌లో ఊటీ టూర్ ప్లాన్ చేస్తున్నారా? మీకోసమే ఈ స్పెషల్ ప్యాకేజీ

by Yella Dhawani Reddy |   (  Updated:2025-04-17 05:32:37  IST  )

వేసవి సెలవులు వచ్చేశాయి.

IRCTC Tour package: సమ్మర్‌లో ఊటీ టూర్ ప్లాన్ చేస్తున్నారా? మీకోసమే ఈ స్పెషల్ ప్యాకేజీ
X

దిశ, వెబ్ డెస్క్: వేసవి సెలవులు వచ్చేశాయి. భానుడు భగ్గుమంటున్నాడు. మండే ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు ఫ్రెండ్స్, ఫ్యామిలీతో ఎక్కడికైనా చల్లని ప్రదేశాలకు టూర్ వెళ్లాలనుకుంటున్నారా? అయితే, మీకోసమే ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) 'అల్టిమేట్ ఊటీ' ప్యాకేజీని తీసుకొచ్చింది. ప్రయాణ టికెట్లతో పాటు వసతి ఏర్పాట్లు వంటి తదితర సౌకర్యాలతో తక్కువ ధరకే ఈ ప్యాకేజీని అందిస్తోంది. మరీ ఈ ప్యాకేజీ పూర్తి వివరాలు తెలుసుకుందామా.

పచ్చని ప్రకృతి అందాలకు నెలవైన ఊటీ అందాలను మాటాల్లో వర్ణించలేం. అందుకే చాలా మంది ఊటీకి వెళ్ళడానికి ఇష్టపడతారు. ఇక వేసవి సెలవుల్లో అందమైన సరస్సుల పక్కనుంచి.. ఎత్తైన కొండల మధ్య ప్రయాణిస్తే ఎలా ఉంటుంది? ఊహించడానికే ఎంతో అద్భుతంగా ఉంది కదా! ఐఆర్‌సీటీసీ అందిస్తోన్ 'అల్టిమేట్‌ ఊటీ' ప్యాకేజీ రైలు ప్రతి మంగళవారం సికింద్రాబాద్‌ నుంచి అందుబాటులో ఉంటుంది. అంతేకాదు, ఈ ట్రైన్ జర్నీ తెలుగు రాష్ట్రాలలోని ముఖ్య పట్టణాల మీదుగా సాగుతుంది. మొత్తం 5 రాత్రులు, 6 పగళ్లు కొనసాగనుంది. జూన్​ 24 వరకు ఈ ప్యాకేజీ పర్యాటకుల కోసం అందుబాటులో ఉంటుంది.

ప్యాకేజీ ధరల వివరాలు:

కంఫర్ట్‌లో (థర్డ్‌ ఏసీ బెర్త్‌) ఒక్కో ప్రయాణికుడికి సింగిల్ షేరింగ్‌కు​ రూ.34,260, డబుల్ షేరింగ్‌‌కు రూ.19,100, ట్రిపుల్ షేరింగ్‌‌కు‌ రూ.17,140 చెల్లించాలి. ఇక 5 ఏళ్ల నుంచి 11 ఏళ్ల మధ్య పిల్లలకు విత్ బెడ్‌ రూ.9,500, విత్ అవుట్ బెడ్ రూ.9,190 గా నిర్ణయించారు.

స్టాండర్డ్‌లో (స్లీపర్ బెర్త్) ఒక్కో ప్రయాణికుడికి సింగిల్ షేరింగ్‌కు రూ.31,800, డబుల్ షేరింగ్‌కు రూ.16,640, ట్రిపుల్ షేరింగ్‌కు రూ.14,680 చెలించాలి. అలాగే, 5 ఏళ్ల నుంచి 11 ఏళ్ల మధ్య పిల్లలకు విత్ బెడ్‌ రూ.7,050లు చెల్లించాల్సి ఉండగా.. విత్ అవుట్ బెడ్‌కి రూ.6,740 చెల్లించాల్సి ఉంటుంది. కాగా, ఈ టూర్ ప్యాకేజీలో ఎవరైనా బృందంగా వెళ్ళాలనుకుంటే టికెట్ ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది.

ప్యాకేజీలో కల్పించే సౌకర్యాలు:

* ఎంచుకున్న ప్యాకేజీపై ఆధారపడి.. రైలులో థర్డ్ ఏసీ , స్లీపర్ క్లాస్ ప్రయాణం ఉంటుంది.

* అలాగే, సైట్ సీయింగ్ కోసం ట్రావెల్ వెహికల్​

* హోటల్‌లో వసతి ఏర్పాటు, ఉచితంగా అల్పాహారం

* ప్రయాణ భీమా సదుపాయం

టూర్ ప్లాన్ :

* మొదటి రోజు: మధ్యాహ్నం 12.20 గంటలకు సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచి రైలు బయలుదేరుతుంది. రాత్రంతా ప్రయాణం ఉంటుంది.

* రెండో రోజు: ఉదయం 7.57 గంటలకు కోయంబత్తూరు రైల్వేస్టేషన్‌ చేరుకుంటారు. అక్కడి నుంచి ట్రావెల్ వెహికల్ ఊటీకి తీసుకెళ్తారు. మధ్యాహ్నం బొటానికల్‌ గార్డెన్‌, ఊటీ సరస్సు సందర్శించి రాత్రి అక్కడే బస ఉంటుంది.

* మూడో రోజు: హోటల్‌లో బ్రేక్‌ఫాస్ట్‌ ముగించుకుని దొడబెట్ట పీక్‌, టీ మ్యూజియం, ప్యాకార ఫాల్స్‌ చూడొచ్చు.

* నాలుగో రోజు: ఉదయం కూనూర్‌కి తీసుకెళ్లి అక్కడి సందర్శక ప్రాంతాలన్నీ చూపించి సాయంత్రానికి ఊటీకి తీసుకొస్తారు.

* ఐదో రోజు: ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ తర్వాత మధ్యాహ్నానికి కోయంబత్తూరు రైల్వేస్టేషన్‌ చేరుకొని 3.55 గంటలకు శబరి ఎక్స్‌ప్రెస్‌ ఎక్కిస్తారు.

* ఆరో రోజు: మధ్యాహ్నం 12.45 గంటలకు తిరిగి సికింద్రాబాద్‌ చేరుకుంటారు.

పూర్తి వివరాలు, టికెట్లు బుకింగ్ కోసం https://www.irctctourism.com/ వెబ్ సైట్‌ను సంప్రదించండి.


Read More..

Metro: నగరవాసులకు షాకింగ్ న్యూస్.. హైదరాబాద్ మెట్రో చార్జీల పెంపు!

Next Story