Elon Musk: 14 మంది పిల్లలకు తండ్రి.. అయినా సంతాన దాహం తీరలేదు.. పిల్లలను కనడంలో మస్క్‌ రికార్డులు సృష్టిస్తున్నాడా?

by Vennela |   (  Updated:2025-04-17 07:56:56  IST  )

Elon Musk: ఎలన్ మస్క్ ప్రపంచంలో అత్యంత ధనవంతుడు మాత్రమే కాదు.

Elon Musk: 14 మంది పిల్లలకు తండ్రి.. అయినా సంతాన దాహం తీరలేదు.. పిల్లలను కనడంలో మస్క్‌ రికార్డులు సృష్టిస్తున్నాడా?
X

దిశ, వెబ్ డెస్క్: Elon Musk: ఎలన్ మస్క్ ప్రపంచంలో అత్యంత ధనవంతుడు మాత్రమే కాదు.. నలుగురు మహిళలతో 14 మంది పిల్లల కన్న తండ్రిగా రికార్డ్ క్రియేట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. తాజాగా ఓ జపాన్ మహిళకు మస్క్ వీర్యదానం చేసినట్లు ఆయన సన్నిహితులు పేర్కొన్నారు. జననాల రేటు పడిపోతే మానవాళికి ప్రమాదం అనే భావనతోనే ఎక్కువ మంది పిల్లలను కనేందుకు మస్క్ ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. తెలివైనవారు ఎక్కువ మంది పిల్లలను కనకపోతే మానవ నాగరికత విచ్చిన్నమవుతుందన్నే కారణంతోనే భారీగా సంతానం వ్యాప్తి చేయాలని మస్క్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తన స్పెర్మ్ ను మహిళలకు అందంచాడని..సర్రోగేట్లను ఉపయోగించడాని , తన కుటుంబ వ్యవహారాలను ప్రజల ద్రుష్టికి దూరంగా ఉంచేందుకు రహస్యంగా ఒప్పందాలను కూడా చేసుకున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక తెలిపింది.

కాగా ఇప్పటికే మస్క్ కు 14 మంది సంతానం ఉంది. తన న్యూరాలింక్ కంపెనీ ఎగ్జిక్యూటివ్, సహజీవనం చేస్తున్న భాగస్వామి అయిన శివోన్ జిలిస్ ద్వారా మస్క్ 14వ సంతానం పొందినట్లు కన్ఫామ్ చేశాడు. వీళ్లిద్దరికీ ఇప్పటికే మూడేళ్ల కవలలు ఉన్నారు.తమకు మరో బాబు పుట్టాడని జిలిస్ తెలిపిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో జపాన్ మహిళలకు వీర్యం దానం చేయడం ద్వారా మస్క్ 15వ సంతానికి సిద్ధమవుతున్నవాడు. 14 మంది పిల్లలకు తండ్రి అయిన మస్క్ సంతాన దాహం తీరలేనట్లుందని..పిల్లలను కనడంలో మస్క్ రికార్డులు క్రియేట్ చేయడం ఖాయం అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. మస్క్ తీరు చూస్తుంటే అలాగే కనిపింస్తోంది.



Next Story