- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యూఎస్ ఏవియేషన్ మ్యూజియంలో జోయ.. తొలి ఇండియన్ పైలట్‌గా రికార్డ్!
దిశ, ఫీచర్స్ : అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో ఏవియేషన్ మ్యూజియంలో స్థానం పొందిన తొలి భారతీయ పైలట్‌గా ఎయిర్ ఇండియాకు చెందిన కెప్టెన్ జోయా చరిత్ర సృష్టించింది.

దిశ, ఫీచర్స్ : అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో ఏవియేషన్ మ్యూజియంలో స్థానం పొందిన తొలి భారతీయ పైలట్‌గా ఎయిర్ ఇండియాకు చెందిన కెప్టెన్ జోయా చరిత్ర సృష్టించింది. ఇప్పటికే ఎన్నో విజయాలు తన ఖాతాలో వేసుకున్న జోయాకు ఈ మైలురాయి ఇంకాస్త ప్రత్యేకమని చెప్పాలి. ఇదేగాక ప్రపంచంలోనే అతి పిన్న వయస్కురాలైన బోయింగ్ 777 కమాండర్‌గా నిలిచిన జోయా.. తన కంపెనీకే కాక దేశానికి చేసిన అద్భుతమైన సేవకు ఎన్నోసార్లు అభినందనలు అందుకుంది.
జోయా అగర్వాల్ నేతృత్వంలోని ఎయిర్ ఇండియా మహిళా సిబ్బంది ప్రపంచంలోనే అత్యంత పొడవైన విమాన మార్గాన్ని కవర్ చేసి చరిత్ర సృష్టించడం తెలిసిందే. వీరి ప్రయాణం శాన్ ఫ్రాన్సిస్కో (SFO) నుంచి బెంగళూరు వరకు ఉత్తర ధ్రువాన్ని కవర్ చేస్తూ సాగింది. ఈ మేరకు ఉత్తర ధ్రువంపై ప్రయాణించిన తొలి భారతీయ మహిళా పైలట్‌గానూ ఆమె ప్రశంసలు అందుకుంది. ఈ ఫీట్‌లో భాగంగా దాదాపు 16,000 కి.మీ దూరాన్ని కవర్ చేసిన జోయా.. US- ఆధారిత ఏవియేషన్ మ్యూజియం(శాన్ ఫ్రాన్సిస్కో మ్యూజియం)లో స్థానం పొందింది. 'ప్రపంచవ్యాప్తంగా మహిళా సాధికారతను ప్రోత్సహించేందుకు.. లక్షలాది మంది బాలికలు, యువకులను తమ లక్ష్యం దిశగా ప్రేరేపించింది. మహిళల కలల సాకారంలో ఆమె సానుకూలత, నిబద్ధత కూడా ముఖ్య పాత్ర పోషించాయి. తన అద్భుతమైన సాహసం భవిష్యత్ తరానికి స్ఫూర్తినిచ్చేలా కెప్టెన్ జోయాను అభినందించడం ప్రత్యేకమైన ఆనందం, గౌరవం' అంటూ ఎస్‌ఎఫ్‌వో జోయాను ప్రశంసల్లో ముంచెత్తింది.
పైలట్‌గానే కాక జోయా తన అద్భుతమైన వాగ్ధాటితో ఆకర్షించగలదు. యువతీయువకుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచేందుకు 12సార్లు TEDx స్పీకర్‌గా విలువైన జీవిత పాఠాలు అందించింది. అంతేకాదు జనరేషన్ ఈక్వాలిటీ, UN ఉమెన్ ఇండియా జనరేషన్ ఈక్వాలిటీ అల్లీ(UN Women India Generation Equality Ally), భారత్ కీ బేటీ ప్రచారాల కోసం మహిళా ప్రతినిధిగా కూడా ఉన్నారు.
1980లో శాన్ ఫ్రాన్సిస్కో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (SFO)లో మ్యూజియం ఏర్పాటైనప్పటి నుంచి విభిన్న నేపథ్యాలు కలిగిన వ్యక్తుల వీరోచిత కథలను వెలుగులోకి తీసుకువస్తోంది. ఈ మేరకు కెప్టెన్ జోయా వ్యక్తిగత చరిత్ర, ఆమె కలలు, సాధించిన విజయాలను అక్కడ చూడొచ్చు. మొత్తం ఐదు టెర్మినల్స్‌లో విస్తరించి ఉన్న గ్యాలరీలో వాణిజ్య విమానయాన చరిత్రకు సంబంధించిన కళాఖండాల సేకరణతో పాటు ఎంతోమంది పైలట్ల సాహసాలు, చారిత్రక సంఘటనలు మ్యూజియంలో కొలువై ఉన్నాయి.
ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ ఉమెన్ ఎయిర్‌లైన్స్ ప్రకారం ప్రపంచంలో అత్యధిక మహిళా పైలట్స్ భారతదేశంలోనే ఉండటం విశేషం.
న్యూయార్క్ ఫ్యాషన్ వీక్.. తొలి ట్రాన్స్ గర్ల్ మోడల్ రికార్డ్






