- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సెల్ఫీ మరణాల్లో అగ్రస్థానంలో ఇండియా
కొత్తగా రెడీ అయినా సెల్ఫీ.. కొత్త ప్రదేశానికి వెళ్లినా సెల్ఫీ.. కూర్చున్నా సెల్ఫీ.. నిల్చున్నా సెల్ఫీ.. తింటున్నా సెల్ఫీ.. పడుకున్నా సెల్ఫీ.. ఇలా తయారైంది నేటి యూత్ జీవితం. ఈ క్రమంలో ప్రమాదాలు కూడా కొనితెచ్చుకుంటున్నారు. సెల్ఫీ కోసం స్టంట్స్

దిశ, వెబ్ డెస్క్ : కొత్తగా రెడీ అయినా సెల్ఫీ.. కొత్త ప్రదేశానికి వెళ్లినా సెల్ఫీ.. కూర్చున్నా సెల్ఫీ.. నిల్చున్నా సెల్ఫీ.. తింటున్నా సెల్ఫీ.. పడుకున్నా సెల్ఫీ.. ఇలా తయారైంది నేటి యూత్ జీవితం. ఈ క్రమంలో ప్రమాదాలు కూడా కొనితెచ్చుకుంటున్నారు. సెల్ఫీ కోసం స్టంట్స్ చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఈ మధ్యే గ్లోబల్ సెల్ఫీ డెత్స్ లిస్ట్ రిలీజ్ కాగా ఇండియా టాప్‌లో ఉంది. అవును.. సెల్ఫీ మరణాల్లో భారతదేశం అగ్రస్థానంలో ఉంది.
మార్చి 2014 నుంచి మే 2025 వరకు చేసిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా జరిగిన వందశాతం మరణాల్లో ఇండియా ఏకంగా 42.1% షేర్‌తో టాప్‌లో నిలిచింది. సెల్ఫీ తీసుకుంటూ ఎత్తైన ప్రదేశాల నుంచి పడిపోవడం, రాళ్లు, భవనాల పైనుండి పడడం, మునిగిపోవడం, రైలు ప్రమాదాలు చోటు చేసుకోవడం వంటివి వీటిలో ఎక్కువగా ఉన్నాయి. ఇక ఇండియా తర్వాత యునైటెడ్ స్టేట్స్ సెకండ్ ర్యాంక్‌లో నిలవగా.. ఆ తర్వాత రష్యా, పాకిస్తాన్, ఆస్ట్రేలియా ఉన్నాయి. కాగా భారతదేశం ఇందులో ప్రథమ స్థానంలో ఉండేందుకు కారణం సోషల్ మీడియాకు అట్రాక్ట్ కావడం, ప్రమాదకరమైన స్థలాలకు సులభంగా యాక్సెస్ పొందడం అనేవి కారణాలుగా ఉండగా.. సెల్ఫీ నిషేధిత జోన్లుగా ప్రకటించడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించవచ్చని సూచిస్తున్నారు నిపుణులు.






