- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమెరికాలోని ఆ నగరంలో హై హీల్స్ ధరించాలంటే ప్రభుత్వ అనుమతి ఉండాల్సిందే!
హై హీల్స్ అనేవి ఫ్యాషన్ ప్రపంచంలో ఎప్పుడూ ట్రెండీగానే ఉంటాయి. అమ్మాయిలు చాలా మందికి హై హీల్స్ వేసుకోవటం ఇష్టపడుతుంటారు.

దిశ, వెబ్ డెస్క్: హై హీల్స్ (High heels) అనేవి ఫ్యాషన్ ప్రపంచంలో ఎప్పుడూ ట్రెండీగానే ఉంటాయి. అమ్మాయిలు చాలా మందికి వీటిని వేసుకోవటం ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా పొట్టిగా ఉన్న మహిళలకు అయితే హై హీల్స్ ప్రాణం అని చెప్పవచ్చు. ఎందుకంటే.. దీనివల్ల వారు పొడవుగా కనిపిస్తారు. ఇక ఇది పూర్తిగా వారి ఇష్టాలపై ఆధారపడి ఉంటుంది. కానీ, ఓ నగరంలో మాత్రం హై హీల్స్ ధరించడం నేరం. కేవలం ఆ దేశంలో ఉన్నవారు మాత్రమే కాకుండా.. అక్కడికి టూర్‌కి వెళ్లిన వారు కూడా అసలు హైహీల్స్‌ను ధరించకూడదు. ఇంతకీ ఆ నగరం ఎక్కడుంది? దాని విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అమెరికాలోని (America) కాలిఫోర్నియా రాష్ట్రంలో కార్మెల్ బై ది సీ (Carmel by the Sea) అనే అందమైన నగరం ఉంది. ఇక్కడ రెండు అంగుళాల కంటే ఎత్తయిన హై హీల్స్ ధరించడంపై ప్రభుత్వం నిషేధం విధించింది. చాలా ఏళ్లుగా ఈ నిషేధం కొనసాగుతుంది. ఒకవేళ ఎవరైనా మహిళలు హై హీల్స్ ధరించాలనుకుంటే ప్రభుత్వం నుంచి పర్మిషన్ ఉండాలి. కార్మెల్ బై ది సీ నగరంలో బీచ్, చారిత్రక కట్టడాలు, ప్రకృతి అందాలు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఆ నగరంలో సైప్రెస్, పైన్ చెట్లు ఎక్కువగా ఉంటాయి. ఆ చెట్లు భారీగా పెరిగి వాటి వేర్లు నగరమంతా విస్తరించాయి. నేలపైకి కూడా చొచ్చుకుని వచ్చి అంతటా పరుచుకున్నాయి. అక్కడి రోడ్లకు ఇరువైపులా పాదచారుల కోసం వేసిన ఫూట్‌పాత్‌లు కూడా ఆ వేర్ల కారణంగా పగిలి దెబ్బతింటున్నాయి. ఎన్నిసార్లు మరమ్మతులు చేసినా ఫలితం ఉండటంలేదు. దీంతో పేవ్‌మెంట్లు విరిగిపోయి నడవడానికి ఇబ్బందికర పరిస్థితి నెలకొంటోంది. అలాంటి చోట్ల హైహీల్స్ వేసుకొని నడిస్తే కిందపడి గాయాలపాలయ్యే ప్రమాదం ఉంది.
ఈ నేపథ్యంలో 1963లోనే అప్పటి నగర అటార్నీ హైహీల్స్‌పై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఎవరైనా హై హీల్స్ వేసుకోవాలనుకుంటే మాత్రం ప్రభుత్వం తీసుకోవాలని తెలిపారు. అనుమతి తీసుకుని హైహీల్స్‌తో నడుస్తూ పడిపోతే దానికి ప్రభుత్వం ఎలాంటి బాధ్యత వహించదు. బాధితులు ప్రభుత్వాన్ని నిందించకుండా, కోర్టులో దావా వేయకుండా ముందుగానే వారి నుంచి హామీ తీసుకుంటారు.






